Bharat Rice : నేటి నుంచి రూ.29కే కేజీ బియ్యం..!!
'భారత్ రైస్' పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం 'భారత్ రైస్'కు శ్రీకారం చుట్టింది.