Bharat Rice: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ రైస్ ద్వారా కిలో బియ్యం రూ.29లకే అందించనుంది. వచ్చే వారం నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ. 60 నుంచి రూ.120 మధ్య ఉంది.