Jp Nadda: పాలన మూగ ప్రేక్షకుడిగా చూస్తుండిపోయింది.. సందేశ్‌ఖలీ ఘటన పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు!

పశ్చిమ బంగాల్‌ సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పశ్చిమ బంగాల్‌ లో పరిపాలన మూగ ప్రేక్షకుడిలా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు.

New Update
Jp Nadda: పాలన మూగ ప్రేక్షకుడిగా చూస్తుండిపోయింది.. సందేశ్‌ఖలీ ఘటన పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు!

Jp Nadda: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఇద్దరు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలు ఉన్నారు.

బుధవారం అర్థరాత్రి బీజేపీ విడుదల చేసిన ఒక ప్రకటనలో, కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని సందర్శించి సమాచారాన్ని సేకరిస్తారని చెప్పారు. ఆ తర్వాత కమిటీ తన నివేదికను జాతీయ అధ్యక్షుడికి అందజేస్తుందని వివరించారు.

మొత్తం రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి

ఉన్నత స్థాయి కమిటీలో కేంద్ర మంత్రులు అన్నపూర్ణాదేవి, ప్రతిమా భౌమిక్, బీజేపీ ఎంపీలు సునీతా దుగ్గల్, కవితా పటీదార్, సంగీత యాదవ్, బ్రిజ్‌లాల్ ఉన్నారు. కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి, బాధితులతో మాట్లాడి తమ నివేదికను జేపీ నడ్డాకు అందజేస్తారు. అదే సమయంలో, సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింస ఘటన హృదయ విదారకంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.

మహిళలపై వేధింపులు, పోకిరీల ఘటనలు నిత్యం జరుగుతున్నాయని, పశ్చిమ బంగాల్‌ లో పరిపాలన మూగ ప్రేక్షకుడిలా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు.

సీఎం రాజీనామా చేయాలని డిమాండ్

సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నిరసనలు, ఘర్షణల దృష్ట్యా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ బుధవారం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో అటవీక రాజ్యం కొసాగుతోందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పాలనలో పశ్చిమ బెంగాల్‌లో "పూర్తి అరాచకం" ఉందని, సందేశ్‌ఖాలీలో గిరిజన మహిళలపై అత్యాచారం, దోపిడీకి ముఖ్యమంత్రి బెనర్జీ తమ పార్టీ గూండాలను పోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో అటవీక రాజ్యం ఉంది - గౌరవ్ భాటియా

గౌరవ్ భాటియా మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్‌లో అటవీక రాజ్యం నడుస్తుంది. మా షెడ్యూల్డ్ తెగ సోదరీమణులపై TMC గూండాలు అత్యాచారం, దాడి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయారని విమర్శించారు.

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పూర్తిగా స్పష్టమవుతుందని భాటియా అన్నారు. మమతాకి పదవిలో కొనసాగే హక్కు లేదని, ఆమెలో కొంచెం కూడా మర్యాద మిగిలి ఉంటే, ఆమె వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

మీరు రాజీనామా చేయకుంటే ప్రజలను తక్కువ అంచనా వేయకండి.. మిమ్మల్ని పాలన నుంచి తరిమికొట్టడం ఖాయం అని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. లైంగిక వేధింపుల బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని, న్యాయం కోసం తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని భాటియా అన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం "రేపిస్టులను రక్షిస్తోంది,. పోలీసులను నిర్వీర్యం చేస్తోంది" అని బీజేపీ నాయకుడు ఆరోపించారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీనిపై కలకత్తా హైకోర్టు దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని ఆయన అన్నారు. మమతా బెనర్జీ 'మూగ ప్రేక్షకురాలిగా' మారారు' అని భాటియా ఆరోపించారు.

Also read: ఎలక్టోరల్ బాండ్లు గురించి నేడు సుప్రీం తీర్పు!

Advertisment
Advertisment
తాజా కథనాలు