లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ స్థానాల్లో ఎవరెవరిని నిలబెట్టాలనే దానిపై అధికార, విపక్ష పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో ఆరు ఎంపీ స్థానాలను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మరోసారి ఎంపీ టికెట్లను ఇచ్చింది.
ఎంపీ అభ్యర్థులు
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
కరీంనగర్ - బండి సంజయ్
నిజామాబాద్ - ధర్మపురి అరవింద్
చేవెల్ల - కొండా విశ్వేశ్వరరెడ్డి
ఖమ్మం - డాక్టర్ వెంకటేశ్వరరావు
భవనగిరి - బూర నర్సయ్య గౌడ్
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఉన్న మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 16 గెలవాలనే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ . ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్న హైకమాండ్ తాజాగా ఆరుగురు అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 11 స్థానాలకు అభ్యర్థును ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, మహబూబ్‌నగర్-డీకే అరుణ, మల్కాజ్‌గిరి - ఈటల రాజేందర్‌లకు ఎంపీ టికెట్లను ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందనరావుకు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.