Raghunandan Rao: కేసీఆర్ అంటేనే అంతం... రఘునందన్ రావు విమర్శలు

TG: మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శల దాడికి దిగారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ అంటేనే ఆర్భాటం, ఆరంభం, అంతం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఇప్పుడు 70 ఏళ్లు అని.. ఆయన రాజకీయాలను వదిలి వ్యవసాయం చేసుకుంటే మంచిదని అన్నారు.

New Update
Raghunandan Rao: కేసీఆర్ అంటేనే అంతం... రఘునందన్ రావు విమర్శలు

BJP EX MLA Raghunandan Rao: మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేసీఆర్ అంటేనే ఆర్భాటం, ఆరంభం, అంతం అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాను అని చెప్పుకునే కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) గా ఉన్న పార్టీని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారని.. ఇప్పుడు ఆయన చేతిలోనే పార్టీ అంతమయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

ALSO READ: జగన్‌పై దాడి.. భారీగా భద్రత పెంపు

ఆనాడు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పిదం వల్లే తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ బతికిందని విమర్శించారు. భస్మాసుర హస్తం వలె ఆయన తల పై ఆయనే చెయ్యి పెట్టుకున్నాడని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు  ఐబై ఏళ్లు... ఇప్పుడేమో 70 ఏళ్లు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయం వదిలేసి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందనేది తన అభిప్రాయం అని చురకలు అంటించారు.

తెలంగాణలో గత పదేళ్లలో ఒక్క మత ఘర్షణ జరగలేదని అన్నారు. బీజేపీ మతం పేరు మీద రాజకీయం చేస్తుంది అనేది అబద్ధం ఐ పేర్కొన్నారు. ఇది అబద్ధపు ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుందని వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగం మార్చే యోచనలో బీజేపీ లేదని తేల్చి చెప్పారు. వీటిపై కాంగ్రెస్ కావాలనే రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు