లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి అడుగులేస్తోంది. గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేతలకు మొండి చేయి చూపిస్తోంది. తాజాగా ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇవ్వలేదు. అలాగే నోరు పారేసుకొని పార్టీ ఇస్తున్న అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలని హితువు చెబుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటలకోని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే తిరుగులేని నేతగా ఎదిగారు. ఆరుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆయన చేసిన వివదస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి.
Also Read: హత్య చేసేందుకు ప్రయత్నించింది మీరు కాదా.. ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి విమర్శలు
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చగలదు
దీంతో కమలం పార్టీ ఆయనకు ఈసారి లోక్‌సభ సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే ఇటీవల బీజేపీ అధిష్ఠానం.. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు తమ లక్ష్యమని చెబుతూ పార్టీ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసింది. ఇలా చెప్పిన తర్వాత కర్ణాట ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందూ సమాజాన్ని అణిచివేసే చట్టాలను కాంగ్రెస్ తీసుకువచ్చిందని.. రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించారు. ఇది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు.
మాకు సంబంధం లేదు
అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఎంపీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని.. తమకు సంబంధం లేదని బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఇదిలాఉండగా.. తాజాగా బీజేపీ అధిష్టానం.. 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇక లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. జూన్ 4వ తేదిన ఫలితాలు రానున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: కేజ్రీవాల్ ఎలా ఆదేశాలిచ్చారు.. సీరియస్ అయిన ఈడీ