BJP Candidate Madhavi Latha: పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలత హడావుడి చేస్తున్నారు. మలక్‌పేట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తున్నారు. అక్కడిక్కడి వచ్చిన వారందరి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో పాటూ వారి ఓటర్ కార్డ్‌లను, ఆధార్ కార్డ్‌లను చెక్ చేస్తున్నారు. బోగస్ ఓట్ల ఆరోపణల నేపథ్యంలోనే తానీ పని చేస్తున్నానని మాధవీలత చెప్పారు. అయితే దాంతో పాటూ ఆమె అక్కడకు ఓటేయడానికి వచ్చిన ముస్లిం మహిళల బుర్ఖాలను కూడా తనిఖీ చేశారు. మహిళల బుర్ఖాలను పైకెత్తి మోహాలను పరీక్సించారు. ఇది ఇప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. దీనిపై ఎమ్ఐఎమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ మహిళ
బుర్ఖా తీయమనడంపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ మహిళలు పవిత్రంగా భావించే బుర్ఖాలను అలా ఎత్తి చూడ్డం అవమానం అని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని, మాధవీలతపై కంప్లైంట్ నమోదు చేయాలని ఈసీని కోరింది.
మరోవైపు నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ కూడా హల్ చల్ చేస్తున్నారు. మైనార్టీ ఏరియాల్లోని పోలింగ్ బూత్‌లను ఆయన సందర్శించారు. ముస్లిం మహిళలు బుర్ఖా ధరించి ఓట్లు వేయడంపై అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read:Elections: పోలింగ్‌లో అవాంఛనీయ సంఘటనలు..క్యూలైన్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి