/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/babu-1-jpg.webp)
Birthday Wishes to CM Jagan: జగన్ నేడు తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి జగన్ కు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలిపారు.
Happy birthday @ysjagan
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2023
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/mCtPY0zcnT
— JanaSena Party (@JanaSenaParty) December 21, 2023
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ (Modi) కూడా జగన్ కు గ్రీటింగ్స్ తెలిపారు. 'ఏపీ సీఎం జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.
Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2023
Also Read: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్ తప్పదా?