తెలంగాణకు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ.. లోక్‌సభలో బిల్లు

ఏపీ విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. 2009 సెంట్రల్ యూనివర్సిటీల చట్టాన్ని సవరణ చేస్తూ సమ్మక్క సారక్క పేరును చేర్చారు.

New Update
Speaker Election : మరి కొద్దిసేపట్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక.. గెలిచేదెవరు?

Lok Sabha : 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర యూనివర్సిటీల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం పేరును మార్చుతూ ఇప్పుడున్న చట్టానికి సవరణ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా తెలంగాణ (Telangana)లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం వల్ల అక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని.. అలాగే గిరిజనుల కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై పరిశోధనలు చేసేందుకు, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఇది బాటలు వేస్తోందని తెలిపింది.

Also Read: ఇంకా వీడని సీఎం సస్పెన్స్.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు

గిరిజనుల చదువులపై దృష్టి సారించడంతో సహా కేంద్ర విశ్వవిద్యాలయాలు చేసే మిగతా కార్యకలాపాలు ఈ సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందని చెప్పింది. ఏపీ విభజన చట్టం ప్రకారమే ఈ వర్సిటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వివరించింది. ఇందుకోసం 2009 సెంట్రల్ యూనివర్సిటీల చట్టాన్ని సవరణ చేస్తూ.. అందులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ పేరును చేర్చుతున్నట్లు పేర్కొంది. ఇందుకోసం కేంద్ర ఏడేళ్లలో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనుంది.

Also Read: మిచౌంగ్‌ తుఫాన్‌ బీభత్సం..ఐదుగురి మృతి..స్కూళ్లు మూసివేత!

Advertisment
Advertisment
తాజా కథనాలు