/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CM-Nitish-Kumar-jpg.webp)
తాజాగా బిహార్ ముఖ్యమంత్రి సెక్స్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు అసభ్యంగా, పురుషాధిక్య ధోరణిని చాటేలా ఉన్నాయంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నితీష్ కుమార్ వెంటనే రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రోజున బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనాభా నియంత్రణ విషయంలో మహిళల విద్యకున్న ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. చదువుకున్న మహిళలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలరని.. అందుకే జనా రేటు తగ్గుతూ వస్తోందని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ మాటలు విని అక్కడున్న సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత అశ్వినీ కుమార్ చౌబే తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశారంటూ విమర్శించారు.
Also Read: ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి!
అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని.. ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామ చేసి వైద్యుడ్ని సంప్రదించాలని పేర్కొన్నారు. ఇక నితీష్ కుమార్ నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. అంతకు ముందు కూడా ఒకసారి భూమి విధ్వంసం గురించి మాట్లాడి విమర్శలు కొనితెచ్చుకున్నారు. అంతలోనే తాజా వ్యాఖ్యలతో పెద్ద దుమారానికే తెర లేపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయ్యండి.
#WATCH | Bihar CM Nitish Kumar uses derogatory language to explain the role of education and the role of women in population control pic.twitter.com/4Dx3Ode1sl
— ANI (@ANI) November 7, 2023