CM Nitish Kumar: రాజకీయ ఊసరవెల్లి.. నితీష్‌ కుమార్ పొలిటికల్ యూటర్న్స్‌

బీజేపీకి మ్యాజిక్‌ మార్క్‌ 272 రాకపోవడంతో ఎన్డీఏతో భాగంగా ఉన్న నితీశ్‌ పార్టీ అవసరం మోదీకి ఎక్కువగా ఉంది. అటు ఇండియా కూటమి నుంచి నితీశ్‌కు బంపర్‌ ఆఫర్లు వస్తున్నాయి. రాజకీయ రంగులు మార్చే పేరున్న నితీష్‌ గురించి తెలుసుకనేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

CM Nitish Kumar: రాజకీయ ఊసరవెల్లి.. నితీష్‌ కుమార్ పొలిటికల్ యూటర్న్స్‌
New Update

'బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కంటే చచ్చిపోవడం బెటర్‌..' ఇది 2023లో నితీశ్‌కుమార్‌ చెప్పిన డైలాగ్‌.. ఇలా ఎక్స్‌ట్రీమ్‌ కామెంట్స్‌ చేయడం తర్వాత ప్లేటు తిప్పడం నితీశ్‌కుమార్‌కు ఓ హాబీ. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్‌ మరోసారి యూటర్న్‌ తీసుకుంటారానన్న చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీకి మ్యాజిక్‌ మార్క్‌ 272 రాకపోవడంతో ఎన్డీఏతో భాగంగా ఉన్న నితీశ్‌ పార్టీ అవసరం మోదీకి ఎక్కువగా ఉంది. అటు అదే సమయంలో INDIA కూటమి నుంచి నితీశ్‌కు బంపర్‌ ఆఫర్లు వస్తున్నాయి. మరి నితీశ్‌ ఏం చేయబోతున్నారు? యూ టర్న్‌ల రారాజుగా నితీశ్‌కు పేరు ఎలా వచ్చింది.. ? ఇప్పుడు తెలుసుకుందాం!

1975 ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళన సమయంలో ప్రజా జీవితంలోకి ప్రవేశించారు నితీష్ కుమార్‌. 1985లో ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. జనతాదళ్ నుంచి బీహార్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 1996లో సమతా పార్టీ టిక్కెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే రెండేళ్లు తిరిగేలోపే.. అంటే 1998లో నితీష్ కుమార్ బీజేపీకి దగ్గరయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు.

Also Read: స్టాక్‌ మార్కెట్ పతనం.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు..

బీజేపీతో విభేదాలు

బీజేపీ మద్దతుతో 2000లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్‌. అయితే, ఫ్లోర్ టెస్ట్‌లో నితీశ్‌ తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు. దీంతో ప్రయాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే నితీశ్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2003లో నితీష్, సమతపార్టీతో పాటు శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ వర్గంతో కలిసి జనతాదళ్-యునైటెడ్ ఏర్పడింది. దీన్నే JDUగా పిలుస్తారు. అయితే 2005 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ JDUపై విజయం సాధించింది. లాలూను ఓడించేందుకు JDU.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. నితీష్ నాయకత్వంలో 2010 బీహార్‌ ఎన్నికలలో JDU-BJP కూటమి అధికారాన్ని దక్కించుకుంది. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికలకు నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించిన తర్వాత నితీశ్‌ కమలం పార్టీతో విభేదించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు!

నితీష్‌ యూటర్న్

2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీశ్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కోవడానికి ఏకంగా RJD-కాంగ్రెస్‌లతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి గెలిచింది. నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే రెండేళ్లకే నితీశ్‌ మరో ట్విస్ట్ ఇచ్చారు. అప్పటివరకు మోదీపై, బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చిన నితీశ్‌ 2017లో NDAలోకి తిరిగి వెళ్లారు. 2020 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లతో పెద్ద కూటమి భాగస్వామిగా అవతరించింది. జేడీయూ ఎమ్మెల్యేల సంఖ్య 43కు తగ్గింది.

Also Read: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్‌ లోపే చదివారా?

ఇక 2022లో నితీష్ మళ్లీ యూ-టర్న్ తీసుకున్నారు. తన పార్టీ జేడీయూను బీజేపీ చీల్చేందుకు ప్రయత్నిస్తోందని కమలం పార్టీని వీడారు. మరోసారి RJDతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అటు బీజేపీకి వ్యతిరేకంగా INDIA కూటమికి మద్దతు తెలిపారు. అయితే 2024 జనవరికి మరోసారి ప్లేటు తిప్పేశారు నితీశ్‌. లోక్‌సభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు మళ్లీ ఎన్డీఏకు సపోర్ట్‌ ప్రకటించారు . ఇలా రెండేళ్లకు ఓ సారి స్టాండ్‌ మార్చుకోవడం నితీశ్‌కు అలవాటుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇలా చాలా సార్లు యూ టర్న్‌ తీసుకున్న నితీశ్‌ బీహార్‌ సీఎంగా ఏకంగా తొమ్మిది సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. అయితే ఇన్నీ యూ టర్న్‌లు తీసుకున్నా నితీశ్‌ సక్సెస్‌ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉండడం విడ్డూరం!

#telugu-news #bihar-cm-nitish-kumar #jdu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe