ఇండియా కూటమి మీటింగ్ కి నితీష్ డుమ్మా..అసలేం మీటింగ్ అంటున్న మమత

తాాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పెద్ద దెబ్బనే కొడుతున్నాయి. వీటి ప్రభావం ఇండియా కూటమి మీద కూడా పడుతున్నాయి. తాజాగా కూటమి మీటింగ్ కు నితీష్ హాజకు కావడం లేదని ప్రకటించారు.

ఇండియా కూటమి మీటింగ్ కి నితీష్ డుమ్మా..అసలేం మీటింగ్ అంటున్న మమత
New Update

నార్త్ లో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ మీద ప్రభావం చూపిస్తోందా అంటే అవుననే అనిపిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఇప్పుడు నార్త్ లో ఒక్క హిమాచల్ ప్రదేశ్ లో తప్పా ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీంతో ఇండియా కూటమి పక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటూ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి సమావేశం మీద కూడా ప్రభావం చూపనున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో రేపు జరగనున్న ఇండియా కూటమికి బీహార్ ఛీఫ్ మినిస్టర్ నితీష్ డుమ్మా కొట్టడం ఒకటి అయితే...అసలేం మీటింగ్, నాకు తెలియదు అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అనడం మరొకటి.

Also Read:ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి?

రేపు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. దీనికి కూటమిలోని పార్టీల పెద్దలందరినీ బుధవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఫోన్ చేసి మరీ చెప్పారు. ఇప్పుడు ఈ మీటింగ్ కే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు కావడం లేదు. ఆయనకు బదులు జేడీయూ ఛీఫ్ లలన్ సింగ్, బీహార్ వాటర్ రిసోర్స్ మంత్రి సంజయ్ కుమార్ ఝా వెళతారని తెలుస్తోంది.

మరోవైపు అసలు ఈ మీటింగ్ గురించే నాకు తెలియదు అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ. అసలు నాకు ఆ మీటింగ్ గురించే తనకు తెలియదని...అందుకే నేను ఇదే రోజున బెంగాల్ లో మరో మీటింగ్ కు హాజరు అవుతున్నాని చెప్పారు. పైగా ముందే తెలిసి ఉంటే కూటమి సమావేశానికే వెళ్ళేదాన్నని అంటున్నారు. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల మీద మమతా ఇప్పటికే విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు సరైన వ్యూహం, ప్రణాళిక ఉండాలి. 2024లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే కేంద్రంలో బీజేపీ అధికాంలోకి రాదు అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జమిందారీ మైండ్ పెట్ తో పోటీలోకి దిగితే ఫలితాలు ఇలానే ఉంటయని కూడా ఆమె అన్నారు. దాని తర్వాత కూటమి మీటింగ్ గురించి ఇలా స్పందించడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.

తాజాగా జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి. కానీ అవన్నీ తారుమారు అయిపోయాయి. ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చూసింది. దీనికి ఒక కారణం ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ముందుకు రాకపోవడమే. దీంతో ఓట్ల విభజన జరిగి కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.

#congress #nithish-kumar #mamatha-benarjee #india-bloc-meeting #bihar-cheif-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe