Bihar: బిహార్‌లో 75 శాతానికి పెరగనున్న రిజర్వేషన్లు.. రేపే అసెంబ్లీలో బిల్లు..

బిహార్ సర్కార్ ఇటీవల కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా గణంకాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న 60 శాతం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Bihar: బిహార్‌లో 75 శాతానికి పెరగనున్న రిజర్వేషన్లు.. రేపే అసెంబ్లీలో బిల్లు..
New Update

బిహార్‌లో ఇటీవల కుల గణన సర్వే చేపట్టిన నేపథ్యంలో.. నితీశ్‌కుమార్‌ కుమార్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచనున్నట్లు ప్రకటన చేసింది. ఇక ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లు కలిపితే మొత్తం ఇవి 75 శాతానికి పెరగనున్నాయి. ఇటీవల బిహార్‌లో ఆ రాష్ట్ర సర్కార్ కులగణన సర్వే నిర్వహించగా.. ఇందుకు సంబంధించిన నివేదికను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపట్టింది. అది ప్రవేశపెట్టిన కొన్ని గంట్లలోనే రిజర్వేషన్లు పెంచుతున్నామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చేపట్టిన కులగణన లెక్కలు కొత్త రిజర్వేషన్లకు ప్రాతిపదిక కానున్నాయి. ఇక ఈ నెల 9న ఈ కొత్త రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బిల్లుకి ఇప్పటికే మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు ప్రకారం చూసుకుంటే.. ఓబీసీ( OBC )కి 18 శాతం, ఈబీసీ ( EBC) కి 25 శాతం, షెడ్యుల్డ్ క్యాస్ట్ (SC) కి 20 శాతం రిజర్వేషన్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) కి 2 శాతం, అలాగే ఈడబ్య్లూసీ (EWC)కి 10 శాతం రిజర్వేషన్లను కేటాయించనున్నట్లు సమాచారం. ఇక మొత్తం రిజర్వేషన్లకు 75 శాతానికి పెరగనున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను చూసుకుంటే.. ఎస్సీకి 14శాతం, ఎస్టీకి 10 శాతం, ఈబీసీకి 12 శాతం, ఓబీసీకి 8 శాతం, మహిళలకు 3 శాతం, జనరల్ కేటగిరిలో ఉన్న పేదవారికి మూడు శాతంగా రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక ఈడబ్య్లూఎస్‌ కోటాకు ఉన్న 10 శాతంతో కలుపుకుంటే మొత్తం 60 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి 75 శాతానికి పెరగుతుడంటంతో చాలామంది ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచిన అధికారులు.. ఆ తేదీలోపే అందిస్తారట

ఇదిలా ఉండగా.. తాజా కులగణన నివేదిక ప్రకారం చూసుకుంటే.. బిహార్‌లో బాగా వెనకబడిన (ఈబీసీ), ఓబీసీతో పాటు వెనకబడిన వర్గాల పరిధిలోకి వచ్చే సబ్ గ్రూపులు అన్నింటినీ కలిపితే.. రాష్ట్ర జనాభాలో బీసీలు 63 శాతం ఉన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీల జనాభా 21 శాతానికి పైగా ఉన్నట్లు సర్వేలో తేలింది. మొత్తం రాష్ట్ర జనాభా 13.07 కోట్లు ఉండగా.. కుటుంబాల సంఖ్య 2.97 కోట్లుగా ఉంది. ఇక ఆదాయాల పరంగా చూసుకుంటే.. బిహార్‌లో 34,13 శాతం అంటే 94 లక్షల కుటుంబాల నెలవారి సంపాదన రూ.6 వేలు మాత్రమే. అంటే రోజుకు కేవలం 200 రూపాయల కన్నా తక్కువే. ఇక ఎస్సీ, ఎస్టీ కుుంబాల్లో నెలసరి ఆదాయ రూ.6వేలకు మించని వారు 43 శాతం ఉన్నారు.

రాష్ట్రం మొత్తం మీద జనాభాపరంగా చూసుకుంటే.. ఉన్నత కులాల జనాభా 10 శాతం ఉంది. అయితే వీళ్లలో నెలకు రూ.6 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల సంఖ్య 25 శాతానికి పైగా ఉంది. అయితే ఇటీవల కులగణన సర్వే చేపట్టడంతో.. దానివల్ల వచ్చిన గణాంకాల ఆధారంగా నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసెంబ్లీలో పేర్కొన్నారు.

Also Read: సీఎం నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామా చేయాలంటూ డిమాండ్‌

#bihar-caste-census #bihar #caste-census
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe