Bihar: బిహార్లో 75 శాతానికి పెరగనున్న రిజర్వేషన్లు.. రేపే అసెంబ్లీలో బిల్లు..
బిహార్ సర్కార్ ఇటీవల కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా గణంకాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న 60 శాతం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.