Bigg Boss 8 Telugu Promo: మొదటి రోజే బిగ్ బాస్ ఇంట్లో శేఖర్ భాష రచ్చ.. సోనియాతో గొడవ

బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సారి కంటెస్టెంట్లను ఒక్కొరిగా కాకుండా జంటలుగా లోపలికి పంపారు. ఇక వెళ్లిన మొదటి రోజు కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమోలో శేఖర్ బాషా, సోనియాకు పెద్ద గొడవ జరిగినట్లు కనిపిస్తోంది.

New Update
Bigg Boss 8 Telugu Promo: మొదటి రోజే బిగ్ బాస్ ఇంట్లో శేఖర్ భాష రచ్చ.. సోనియాతో గొడవ

Bigg Boss 8 Telugu Promo: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది. ఆదివారం హోస్ట్ నాగార్జున గ్రాండ్ గా లాంచ్ ఎపిసోడ్ ప్రారంభించారు. సీజన్ 8 ‘ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు’ అనే ట్యాగ్ మొదలైన ఈ షోలో ట్విస్టులు, టర్న్స్ చాలానే ఉండబోతున్నట్లు లాంచ్ ఎపిసోడ్ చూస్తూనే అర్థమవుతుంది. అంతేకాదు ప్రతి సీజన్ కు బిన్నంగా ఈ సారి కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా కాకుండా జంటలుగా లోపలి పంపారు. ఒక మేల్ ఒక ఫిమేల్ కంటెస్టెంట్ ను జోడీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆదిత్య ఓం, శేఖర్ బాషా, యష్మీ గౌడ, విష్ణు ప్రియ, అభయ్ నవీన్, ప్రేరణ, పరమేశ్వర్ హివ్రాలే, నైనికా, సోనియా ఆకుల, నిఖిల్, బెజవాడ బేబక్క, సీత, నాగ మణికంఠ.నబీల్ అఫ్రిదీ, ప్రిథ్వీరాజ్ సీజన్ 8 కంటెస్టెంట్లుగా వచ్చారు.

ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో 

ఇది ఇలా ఉంటే తాజాగా మోస్ట్ అవైటెడ్ సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ప్రోమో చూస్తుంటే మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిన శేఖర్ భాష (Shekar Basha) హౌస్ లో కూడా చాలా ఫైర్ మీద ఉన్నాడు. శేఖర్ భాష, ఫీమేల్ కంటెస్టెంట్ సోనియా మధ్య పెద్ద గొడవే జరిగింది. కానీ ఇదంతా ఒక ఆరెంజ్ కోసం జరగడమే బాధాకరం. ఇక వీళ్ళ గొడవ తర్వాత కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ పట్టుకునే ఉండండి టాస్క్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఫస్ట్ డే ప్రోమో అయితే ఆసక్తికరంగానే కనిపించింది. మరి ఎపిసోడ్ లో కూడా ఇదే ఫైర్ ఉంటుందా లేదా చూడాలి.

Also Read: HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల విషెస్.. చిరంజీవి స్పెషల్ పోస్ట్..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు