Bigg Boss 7 Telugu Promo: అమర్ దీప్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోకి వైఫ్ తేజశ్విని సర్ ప్రైజ్ ఎంట్రీ..!

బిగ్ బాస్ సీజన్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ సందర్భంగా బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ దీప్ వైఫ్ తేజశ్విని ఇంట్లోకి వచ్చింది.

Bigg Boss 7 Telugu Promo: అమర్ దీప్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోకి వైఫ్ తేజశ్విని సర్ ప్రైజ్ ఎంట్రీ..!
New Update

Bigg Boss 7 Telugu Promo:  బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సందడి స్టార్ట్ అయ్యింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో హౌస్ మేట్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లోకి అశ్విని, అర్జున్, శివాజీ, భోలే, ప్రియాంక, గౌతమ్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లికి వచ్చారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ వైఫ్ తేజశ్విని (Tejaswini) బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది.

Bigg Boss 7 Telugu Promo

తేజశ్విని ఎంట్రీ చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. తేజశ్విని ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు.. బిగ్ బాస్ అమర్ (Amar) ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. తేజు ఇంట్లోకి రాలేకపోయింది.. అందుకని మీ బర్త్ డే కోసం కేక్ పంపారని చెప్పాడు. దాంతో అమర్.. 'నిన్నటి నుంచి అందరి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు.. నా మనసులో నువ్వు కూడా వస్తావు అనుకున్న'.. కానీ రాలేకపోయావు అంటూ ఫీల్ అయ్యాడు. ఇక అమర్ కేక్ తీసుకొని కన్ఫెషన్ రూమ్ లో నుంచి బయటకు రాగానే.. ఇంట్లో తన భార్య తేజును చూసి సర్ ప్రైజ్ అయ్యాడు.

Bigg Boss 7 Telugu Promo

Bigg Boss 7 Telugu Promo

చాలా రోజుల తర్వాత అమర్ ను చూడగానే తేజు ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది కూడా. ఆ తర్వాత అమర్ తేజశ్వినితో మాట్లాడుతూ.. 'నిన్ను చాలా మిస్ అయ్యాను.. గుర్తొచ్చినప్పుడు పడుకొని ఏడ్చేవాడిని.. కొన్ని సార్లు ఏడిస్తే కనపడుతుందని.. తెలియకుండా ఏడ్చానని' ఎమోషనల్ అయ్యాడు అమర్. ఆ తర్వాత.. తన భార్య.. హౌస్ మేట్స్ తో కలిసి అమర్ బిగ్ బాస్ ఇంట్లో తన బర్త్ డే ను సెలెబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా అమర్ కు తేజు వాళ్ళ ఎంగేజ్ మెంట్  రింగ్ ప్రెసెంట్  చేసి.. సర్ ప్రైజ్ చేసింది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులందరు తేజు, అమర్ తో ఫన్ చేస్తూ  చాలా ఆనందంగా కనిపించారు.

Also Read: Bigg Boss 7 Telugu: వాళ్లకు దూరంగా ఉండు.. హింట్ ఇచ్చిన ప్రియాంక బాయ్ ఫ్రెండ్..!

#bigg-boss #bigg-boss-7 #bigg-boss-7-telugu-live-updates #bigg-boss-7-latest-episode #bigg-boss-7-promo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe