Bigg Boss 7 Telugu: "నేను ఎవరో తెలియకపోతే గూగుల్ ను అడుగు".. ప్రశాంత్ పంచ్ డైలాగ్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో మొదట్లో అశ్విని, అమర్ నామినేషన్ కాస్త ఫన్నీగా కనిపించినా .. ఆ తర్వాత అర్జున్, ప్రశాంత్ మధ్య జరిగిన వాదనలతో బిగ్ బాస్ ఇల్లంతా హీటెక్కిపోయింది. By Archana 14 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ రచ్చ కొనసాగుతూనే ఉంది. నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులంతా చాలా ఫైర్ మీద ఉన్నట్లుగా కనిపించారు. వారమంతా కలిసి మెలిసి హ్యాపీగా ఉండే ఇంటి సభ్యులు నామినేషన్ ప్రక్రియ వచ్చిందంటే.. వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తారు. ఇక ఈ రోజు తాజాగా విడుదలైన నామినేషన్స్ ప్రోమోలో. ఎప్పటి లాగే.. ఈ వారం కూడా.. నామినేషన్ ప్రక్రియలో అపరిచితుడులా మారాడు ప్రశాంత్. అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య నామినేషన్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ ప్రోమో మొదట్లో కాస్త ఫన్నీగా సాగిన.. ఆ తర్వాత ఇంటి సభ్యుల అరుపులతో ఇల్లంతా వేడెక్కిపోయింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఈ నామినేషన్ ప్రక్రియలో ముందుగా వచ్చిన అశ్విని.. అమర్ (Amar) ను నామినేట్ చేసింది. అశ్విని.. అమర్ ను నామినేట్ చేస్తూ.. "ఈ పాయింట్ మీకు సిల్లీ అనిపిస్తుందేమో కానీ.. అంత పెద్ద దీపావళి ఈవెంట్ లో నా పై.. నువ్వు పాడిన పాట నాకు నచ్చలేదు.. నా మనోభావాలు దెబ్బతిన్నాయని" చెప్పింది. ఇక వీళ్లిద్దరి నామినేషన్ కాస్త ఫన్నీగా జరిగింది. మధ్యలో అశ్విని మాట్లాడే మాటలకు ఇంటి సభ్యులంతా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఎవరో గూగుల్ ను అడుగు ఇక అర్జున్ (Arjun), ప్రశాంత్ (Pallavi Prashanth) మధ్య ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అర్జున్.. ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. ఇక ఈరోజు ప్రోమోలో ప్రశాంత్.. అర్జున్ ను నామినేట్ చేస్తూ.. "నన్ను వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నావు.. నేను ఇక్కడికి ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు.. ఎవ్వరు చెప్పిన నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను" అని వాదించాడు. దానికి అర్జున్ "నేను.. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అని చెప్పలేదు.. నేను చెప్పని దాన్ని ఎందుకు అంటున్నావు" అని ప్రశాంత్ పై కోపంతో అరిచాడు. వీళ్లిద్దరి వాదనలో.. "నన్ను తప్పు అనడానికి నువ్వెవరు" అని ఫైర్ అయ్యాడు అర్జున్. దానికి "ప్రశాంత్ నేను ఎవరో తెలియకపోతే గూగుల్ ను అడుగు" అని సంబంధం లేని డైలాగ్ వేశాడు. ఇక కోపంతో అర్జున్ "నన్ను నామినేట్ చేసింది.. పల్లవి ప్రశాంత్ అందుకే నిన్నే అడుగుతా" అని రెచ్చిపోయాడు. ఆ తర్వాత అమర్- యావర్, యావర్- శోభ మధ్య ఆర్గుమెంట్ జరింగింది. "లాస్ట్ వీక్ నిన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాను.. కానీ కుదరలేదు.. ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను" అని శోభ యావర్ ను నామినేట్ చేసింది. ఈ విషయంలో యావర్ శోభతో వాదించాడు. Also Read: Bigg Boss 7 Telugu: “మీరు బిగ్ బాస్ కు మహారాణులు కదా..” ప్రియాంక పై ఫైర్ అయిన అశ్విని..! #bigg-boss-7 #bigg-boss-7-telugu-live-updates #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి