Bigg Boss 7 Telugu: "మీరు బిగ్ బాస్ కు మహారాణులు కదా.." ప్రియాంక పై ఫైర్ అయిన అశ్విని..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. By Archana 14 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ఇంటి సభ్యుల వాదనలతో ఇల్లంతా హీటెక్కిపోయింది. ఈ నామినేషన్ ప్రక్రియలో అర్జున్, రతిక కాస్త రూట్ మార్చారు. వీకెండ్ ఎపిసోడ్ లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన హింట్స్ దృష్టిలో పెట్టుకొని కాస్త రూట్ మార్చాడు అర్జున్ (Arjun Ambati). ఎప్పుడు నవ్వుతూ.. కూల్ గా ఉండే అర్జున్ నిన్న నామినేషన్ ఎపిసోడ్ లో మాత్రం చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. ఇక రతిక (Rathika) కూడా శివాజీ ఇచ్చిన సలహాలతో.. నామినేషన్ ప్రక్రియలో ప్రియాంక, శోభ పై రెచ్చిపోయింది. అర్జున్ Vs ప్రశాంత్ నిన్న నామినేషన్ ఎపిసోడ్ లో అర్జున్, ప్రశాంత్ (Pallavi Prashanth) చాలా సమయం వాదించుకున్నారు. మధ్య మధ్యలో అర్జున్.. ప్రశాంత్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఇమిటేట్ చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అర్జున్ ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. "నువ్వు రివెంజ్ నామినేషన్స్ వేస్తావు.. లేదా శివన్నను ఎవరైనా నామినేట్ చేస్తే తిరిగి వాళ్ళను నామినేట్ చేస్తావు.. నీ సొంతంగా ఒక్కసారైనా నామినేట్ చేశావా" అని అడిగాడు. దానికి ప్రశాంత్ "నేను నా సొంతగానే నామినేషన్స్ వేశాను.. హౌస్ మేట్ నాకు తప్పనిపిస్తే నామినేట్ చేశాను.. ఎవ్వరి కోసం నేను చేయలేదని" అర్జున్ తో వాదించాడు. బిగ్ బాస్ కు మీరు మహారాణులు ఆ తర్వాత ప్రియాంక, అశ్విని మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇద్దరు ఒకరి పై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. ఇక ప్రియాంక అశ్విని ని నామినేట్ చేస్తూ.. "మేము నిన్ను డామినేట్ చేస్తున్నాము.. అన్నట్లుగా చెప్పడం నాకు నచ్చలేదు" అని చెప్పింది. దాంతో అశ్విని.. రాజమాతల టాస్క్ లో శోభ, నువ్వు ఇద్దరు నన్ను డామినేట్ చేశారు.. మా డెసిషన్ తెలుసుకోకుండా మీకు నచ్చిందే చేశారు.. మీ ఇద్దరు బిగ్ బాస్ కు మహారాణులు కదా.. అంటూ ప్రియాంకతో వాదించింది. ఈ నామినేషన్ ప్రక్రియలో గౌతమ్.. నా ఇద్దరి ఫ్రెండ్స్ ను నామినేట్ చేస్తున్నానని చెప్పి.. అర్జున్, గౌతమ్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. ఇక రతిక.. శోభ (Shobha) , ప్రియాంక ఇద్దరినీ నామినేట్ చేసింది. శోభ, రతిక మధ్య పెద్ద గొడవే జరిగింది. రతిక శోభను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.. దానికి శోభ నువ్వెంత ట్రై చేసిన నీకు కావాల్సిన కంటెంట్ ఇవ్వనులే బాగానే కౌంటర్ ఇచ్చింది. Also Read: Bigg Boss 7 Telugu: “నువ్వు బయటకు వెళ్లి చూసిన ఏం చేయలేదులే” .. రతికకు ప్రియాంక కౌంటర్ #bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి