Bigg Boss 7: గౌతమ్ ఎలిమినేటెడ్.. కానీ ఓటింగ్ లో బాటమ్ అర్జున్..? షాకిచ్చిన నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతోంది. ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో గౌతమ్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు.ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఓటింగ్ ప్రకారం బాటమ్ లో ఉన్న అర్జున్ వెళ్ళిపోవాలి కానీ ఈ వారం ఫినాలే అస్త్రా గెలిచినందున సేవ్ అయ్యాడని షాకిచ్చారు.

New Update
Bigg Boss 7: గౌతమ్ ఎలిమినేటెడ్.. కానీ ఓటింగ్ లో బాటమ్ అర్జున్..? షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలింది. ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున తో పాటు హీరో నాని (Hero Nani) బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. నాన్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నానీ.. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. నాగార్జున, నానీ హౌస్ మేట్స్ అందరి గురించి మాట్లాడుతూ కాసేపు ఫన్ చేశారు.

ఎవిక్షన్ పాస్ ఎవరికీ ఇవ్వను

ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ప్రియాంక, అర్జున్, శివాజీ, యావర్, ప్రశాంత్ ముందుగా సేవ్ అయ్యారు. చివరిలో గౌతమ్, శోభ ఇద్దరు మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఇప్పటికే ప్రశాంత్ (Pallavi Prashanth) తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నందున.. గౌతమ్ (Gowtham), శోభ ఇద్దరిలో ఒకరికి ఆ పాస్ వాడి.. సేవ్ చేయొచ్చని తెలిపారు నాగార్జున. కానీ ప్రశాంత్.. ఒకరిని సేవ్ చేసి హీరో అవ్వను.. ఇంకొకరిని ఎలిమినేట్ చేసి విలన్ అవ్వలేను.. అందుకే నేను ఎవరికీ వాడను అని చెప్పాడు. గౌతమ్, శోభ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకొని సేవ్ అవ్వడం ఇష్టంలేదని చెప్పారు. దాంతో బిగ్ బాస్ దాన్ని తిరిగి తీసుకున్నారు.

publive-image

గౌతమ్ ఎలిమినేటెడ్

ఇక చివరిలో గౌతమ్ శోభ ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ తర్వాత నాగార్జున గౌతమ్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడని తెలిపారు. స్టేజ్ పైకి వచ్చిన గౌతమ్.. హౌస్ మేట్స్ లో మాస్క్ ఉన్నది ఎవరో చెప్పాలని అడిగారు నాగార్జున. ఇక గౌతమ్ ప్రశాంత్, అమర్, శివాజీ ఇంకా మాస్క్ తో ఉన్నారు. ఇంకా బయటకు రావట్లేదని చెప్పాడు. దానికి శివాజీ.. "నువ్వు ఎప్పుడు ఇతరుల ఓదార్పు కోసం చూస్తావు.. ఎప్పుడైనా నీ సొంతంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పారు. ఇక గౌతమ్ ఇది నా అభిప్రాయం మాత్రమే అని తెలిపాడు.

publive-image

అర్జున్ కు షాకిచ్చిన నాగార్జున

గౌతమ్ స్టేజ్ పై నుంచి వెళ్లిన తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ఎలిమినేషన్ లిస్ట్ బాటమ్ లో ఉన్నది గౌతమ్ కాదు, అర్జున్.. ఈ వారం తాను గేమ్ బాగా ఆడి ఫినాలే అస్త్రా గెలిచినందున సేవ్ అయ్యాడు.. లేదంటే ఈ వారం అర్జున్ ఎలిమినేట్ అయ్యేవాడని పెద్ద షాకిచ్చారు నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు.

publive-image

Also Read: Actor Sameer : “అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు.. ఇది కరెక్ట్ కాదు”.. యాక్టర్ సమీర్ షాకింగ్ కామెంట్స్..!

Advertisment
తాజా కథనాలు