Bigg Boss 7: "మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్".. పాపం అర్జున్..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ అర్జున్ కోసం 2 కిలోల కేక్ పంపించారు. ఈ కేక్ మొత్తం అర్జున్ మాత్రమే తినాలని షాకిచ్చారు. ఇక అర్జున్ "మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్" అంటూ ఫన్ చేశాడు.

Bigg Boss 7: "మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా  బిగ్ బాస్".. పాపం అర్జున్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఆట చివరి దశకు చేరుకుంది. ఇంకా కేవలం రెండు మాత్రమే మిగిలింది. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంట్లో భాగంగా ఇంటి సభ్యులు కొన్ని టాస్కుల్లో పాల్గొన్నారు. ఈ టాస్క్ మధ్యలో బిగ్ బాస్ హౌస్ మేట్స్  ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ.. షో మరింత ఎంటర్ టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేశారు.  ఇక ఈరోజు తాజాగా బిగ్ బాస్ ప్రోమో రీలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ అర్జున్ కోసం 2 కిలోల కేక్ పంపించి దానిని తినమని చెప్పారు.

publive-image

"మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా"

"అర్జున్ కోసం మాత్రమే ఆ కేక్ ను.. అర్జున్ ఆ కేక్ పూర్తిగా తినగలిగితే ఇంటి సభ్యులందరికీ కేక్ లభిస్తుందని" తెలిపారు బిగ్ బాస్. ఈ మాట వినగానే అర్జున్ షాకయ్యాడు. అర్జున్ ను చూసి ఇంటి సభ్యులంతా నవ్వుకున్నారు. "వీడే కాదు.. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా తినలేదు అంటూ ఫన్ చేశాడు శివాజీ. ఇక అర్జున్ "మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్" అనగానే.. నువ్వు తింటావులే అని డైలాగ్ వేశాడు అమర్.

publive-image

నీ వల్ల అవుతది అన్నా..

అర్జున్ కేక్ తినలేక అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ప్రశాంత్.. అర్జున్ కండలను చూపిస్తూ "నీ వల్ల అవుతది" అని ఎంకరేజ్ చేశాడు. "ఒరేయ్ కండలకు.. తినే పొట్టకు సంబంధం ఏంట్రా" అని కామెడీ చేశాడు అర్జున్. ఇక శివాజీ.. "దేవుడా అర్జున్ కు కేక్ తినే శక్తిని ప్రసాదించు" అంటూ అందరినీ నవ్వించాడు.

publive-image

అర్జున్ కు బిగ్ బాస్ ఆఫర్

అర్జున్ ఒక్కడే కేక్ తినలేకపోవడంతో.. యావర్ తో కలిసి కేక్ పూరి చేయొచ్చు అని మంచి ఆఫర్ ఇచ్చాడు. యావర్, అర్జున్ ఇద్దరు కలిసి కేక్ పూర్తి చేయడానికి కుస్తీలు పడుతున్నారు. ఇక ఇంటి సభ్యులు వాళ్ళు కూడా  కేక్ తినొచ్చనే ఆశతో.. వాళ్ళిద్దరినీ కేక్ తినడానికి ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు.  ఇక ఈ ప్రోమో అంతా చాలా ఫన్నీగా కనిపించింది.

publive-image

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్.. సినిమా ఎప్పుడంటే..!

#bigg-boss #bigg-boss-telugu #bigg-boss-promo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe