Bigg Boss 7 Telugu: వెదవ రీజన్స్ చెప్పకు..నేను కావాలని తోసానా.. ప్రశాంత్ పై అర్జున్ ఫైర్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్జున్ ప్రశాంత్ పై గట్టిగా అరిచాడు. By Archana 06 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఫినాలే వీక్ దగ్గరగా ఉన్నందున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ కొన్ని టాస్కుల్లో పాల్గొనాలని తెలిపారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో గెలిచిన వారికి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇక ఈ రోజు తాజాగా విడుదలైన ప్రోమోలో ఓట్ అపీల్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. చెర్రీ కింద పడితే ఔట్ ఈ టాస్క్ లో బిగ్ బాస్ కేక్ పై ఉన్న చెర్రీని కింద పడకుండా.. కార్డ్ తో స్లైస్ చేయాలనీ తెలిపారు. కేక్ స్లైస్ చేస్తున్నప్పుడు ఎవరి చెర్రీ.. కింద పడితే వాళ్ళు రేస్ నుంచి ఔట్ అని చెప్పారు. ప్రోమో ప్రకారం శోభ చివరి వరకు ఈ టాస్క్ ఆడినట్లు కనిపించింది. విన్నర్ ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. సెకండ్ ఛాలెంజ్ ఆ తర్వాత సెకండ్ కంటెండర్ అవ్వడానికి మరో టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో బజర్ మోగినప్పుడు ఎవరైతే అక్కడ ఏర్పరిచిన బెల్ మోగిస్తారో.. వారు రెండవ కంటెండర్ గా నిలుస్తారని తెలిపారు బిగ్ బాస్. వెదవ రీజన్స్ చెప్పకు .. నేను కావాలని తోసానా సెకండ్ ఛాలెంజ్ లో కూడా ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. బజర్ మోగగానే బెల్ కొట్టడానికి హౌస్ మేట్స్ అంతా పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో యావర్, ప్రశాంత్, అర్జున్ తోసుకుంటూ వచ్చి కింద పడ్డారు. ఈ విషయంలో అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రశాంత్.. 'నువ్వు కావాలని తాకించావు' అని అర్జున్ ను నిందించాడు. దీంతో అర్జున్ 'వెదవ రీజన్స్ చెప్పకు.. నేను కావాలని తోసానా.. నువ్వు చూశావా' అని ప్రశాంత్ పై గట్టిగా అరిచాడు. ఇక ప్రియాంక 'పుష్ చేయకండి.. మీ దారిలో మీరు వెళ్ళండి' అని అందరి పై కోప్పడింది. Also Read: Bigg Boss 7: “మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్”.. పాపం అర్జున్..! #bigg-boss-7 #bigg-boss-telugu #bigg-boss-promo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి