Bigg Boss 7 Telugu: "మీరు ఎప్పటికీ వెలిగే జ్యోతి".. బిగ్ బాస్ మాటలకు ఎమోషనల్ అయిన అమర్..!

ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ అమర్ జర్నీ వీడియోను చూపించారు. బిగ్ బాస్ ఇంట్లో అమర్ జర్నీ గురించి చక్కటి మాటల్లో సంబోధించారు. హౌస్ లో 14 వారల పాటు సాగిన తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు అమర్.

Bigg Boss 7 Telugu: "మీరు ఎప్పటికీ వెలిగే జ్యోతి".. బిగ్ బాస్ మాటలకు ఎమోషనల్ అయిన అమర్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్స్ మొదటి నుంచే ఆసక్తిగా సాగుతూ వచ్చింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ 7 కాస్త డిఫరెంట్ గా సాగిందనే చెప్పొచ్చు. 15 వారాల పాటు సాగే ఈ షో చివరి దశకు చేరుకుంది. ఇంకా కేవలం ఒక వారం మాత్రమే మిగిలింది. 15 మంది కంటెస్టెంట్ తో పోటీపడి ఆరుగురు హౌస్ మేట్స్ ఫైనల్స్ చేరుకున్నారు. అమర్, అర్జున్, ప్రియాంక, శోభ, యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ ని టాప్ సిక్స్ గా అనౌన్స్ చేశారు నాగార్జున (Nagarjuna).  ఇక ఈ చివరి వారంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వారి జర్నీ వీడియోలను చూపించి వారి జ్ఞాపకాలను గుర్తు చేస్తారు.

ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ అమర్ జర్నీ వీడియోను చూపించారు.  ఇంట్లో అమర్ జర్నీ (Amar Journey) గురించి చక్కటి మాటల్లో సంబోధించారు బిగ్ బాస్. తన జర్నీ చూసి  అమర్ ఎమోషనల్ అయ్యాడు. 14 వారల ఆటలో అమర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాల ఫొటోలను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. వాటిని చూసి తన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుచేసుకున్నాడు అమర్.

Bigg Boss 7 Telugu

మీ పేరుకు అర్థం ఎప్పటికీ వెలిగే జ్యోతి

ఆ తర్వాత జర్నీ చూపించే ముందు.. అమర్ ఆట గురించి బిగ్ బాస్ తన చక్కటి మాటలతో వర్ణించారు. మీ పేరుకు అర్థం ఎప్పటికీ వెలిగే జ్యోతి.. అదే విషయం మీ ప్రయాణంలో ప్రతిభింబించింది. ఎలాగైనా ఆటలో గెలిచి చివరి వరకు చేరాలనే మీ తపన.. మీ ప్రయాణాన్ని మలిచింది అని తెలిపారు.

Bigg Boss 7 Telugu

మీ చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని, అల్లరి, వెటకారాన్ని .. మీ స్నేహితుల కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న వారు లేరు. కొన్ని సార్లు మీ కట్టలు తెంచుకున్న కోపం.. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా.. మీ స్నేహితులే మీకు కవచంలా మారారు అంటూ ప్రియాంక, శోభ (Shobha Shetty), అమర్ స్నేహం గురించి మళ్ళీ గుర్తుచేశారు. మీలో ఆవేశం ఎంత ఉందో.. వినోదం కూడా అంతే ఉందనేది అందరు ఒప్పుకోవాల్సిన విషయం అని చెప్పారు. తన జర్నీ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అమర్.. బాధగా అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: టాప్ 5 లో ఉండలేకపోయా.. స్టేజ్ పై ఏడ్చేసిన శోభ..!

#bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo #amar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe