Bigg Boss 7 Telugu: టాప్ 5 లో ఉండలేకపోయా.. స్టేజ్ పై ఏడ్చేసిన శోభ..! బిగ్ బాస్ సీజన్.. 7 తాజాగా ముగిసిన వీకెండ్ ఎపిసోడ్ లో అర్జున్, ప్రియాంక, అమర్, యావర్, ప్రశాంత్, శివాజీ ఫైనల్స్ కు చేరుకున్నట్లు నాగార్జున అనౌన్స్ చేశారు. ఇక ప్రేక్షకులు ఊహించినట్లే ఎలిమినేట్ అయిన శోభ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. By Archana 11 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా ఒక్క వారం ఆట మాత్రమే మిగిలింది. బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ దాటికొని కేవలం ఆరుగురు ఇంటి సభ్యులు మాత్రమే ఫినాలే కు చేరుకున్నారు. ఇప్పటికే ఫినాలే అస్త్రాను గెలుచుకున్న అర్జున్ ఆల్రెడీ ఫైనల్స్ కి వెళ్ళిపోయాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అమర్, శోభ, యావర్, ప్రియాంక, ప్రశాంత్, శివాజీల లో ఫైనల్స్ కు చేరుకుంది ఎవరో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున అనౌన్స్ చేశారు. శోభ ఎలిమినేటెడ్ నాగార్జున ఫైనల్స్ కు చేరుకున్న ఇంటి సభ్యుల పేర్లు ఒకరి తర్వాత ఒకరివి అనౌన్స్ చేశారు. ఫినాలే అస్త్రా గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా అర్జున్ తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ గా ప్రియాంక పేరు అనౌన్స్ చేశారు. ప్రియాంక తర్వాత అమర్, ప్రశాంత్, యావర్ ఫైనల్స్ కి వెళ్లిన్నట్లు తెలిపారు. ఇక చివరిలో శివాజీ, శోభ ఎలిమినేషన్ రౌండ్ లో పాల్గొన్నారు. ప్రేక్షకులు ఊహించినట్లే శోభ ఎలిమినేట్ అయ్యింది. శివాజీ ఫైనల్స్ కు వెళ్లారు. ఎలిమినేట్ అయిన శోభ స్టేజ్ పై తన జర్నీ చూసుకొని ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది. ఆ తర్వాత నాగార్జున.. వెళ్లేముందు ఇంటి సభ్యులకు.. వాళ్ళ పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పాలని అడిగారు. అర్జున్ నా సపోర్ట్ నీకే ఇక వెళ్లేముందు శోభ ఇంటి సభ్యులందరితో మాట్లాడింది. అర్జున్ తనకు ఓటింగ్ తక్కువగా ఉందని ఫీల్ అవుతున్నాడు.. బయటకు వెళ్ళాక నా ఓట్స్ అన్నీ నీకే అని ఎంకరేజ్ చేసింది. ఆ తర్వాత ప్రియాంకను బాగా ఆడమని పోత్సహించింది. అమర్ తో మాట్లాడుతూ.. కప్పు గెలుచుకొని రావాలని చెప్పింది. ఆ తర్వాత శివాజితో మాట్లాడింది. నేనే ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని కోరింది. యావర్ కొన్ని సార్లు తప్పుగా అర్థం చేసుకుంటాడు కానీ ఈ మధ్య చాలా మారాడు పాజిటివ్ గా ఉంటున్నాడని చెప్పింది. పాపం టాప్ 5 కి వెళ్లాలనే శోభ కళ.. కళగానే మిగిలింది. Also Read: Samantha Ruth Prabhu: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత..! #bigg-boss #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి