Bigg Boss 7 Promo: ఎమోషనల్ గా మారిపోయిన బిగ్ బాస్ హౌస్.. బిగ్ బాస్ హౌస్ అంటేనే కోపం, బాధ, సంతోషం, ఏడుపులు. ఇక ఈ రోజు ప్రోమోలో ఇంటి సభ్యులు అందరు కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. ప్రోమో ప్రకారం ఇప్పటికే కెప్టెన్సీ(Captaincy) టాస్క్ లో 3 లెవెల్స్ పూర్తి చేసిన ఇంటి సభ్యులకు(House mates) ఇక బిగ్ బాస్ ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి 'చిట్టి ఆయిరే' అంటూ మరో టాస్క్ ఇస్తాడు.
ఈ టాస్క్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. సీజన్ 5 లో ఒకరి కోసం ఒకరు లెటర్స్ త్యాగం(Sacrifice) చేసుకున్న తరహాలోనే ఈ టాస్క్ కనిపిస్తోంది. కంటెస్టెంట్స్ కు వారి కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు(Letter's) వస్తాయి. వారు కంటెండర్ అవ్వాలంటే వాటిని త్యాగం చేయాలి. ఇక యాక్టివిటీ రూమ్ లో వారి ఫ్యామిలీస్ పంపిన ఉత్తరాలను చూసి కంటెస్టెంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అమ్మ కోసం సందీప్ కన్నీళ్లు
సందీప్ (Sandeep), అమర్(Amar) జంటగా ఉంటారు. ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాన్ని చూసిన సందీప్.. అమ్మకు ఆరోగ్యం బాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మ అనే సరికి ఏం మాట్లాడలేకపోతున్నాని అమర్ ఏడుస్తూ చెప్తాడు. మరి వీరిద్దరిలో లెటర్ ఎవరి కోసం ఎవరు త్యాగం చేస్తారో చూడాలి.
తేజను ఓదార్చిన యావర్
వాళ్ళ కుటుంబ సభ్యులు పంపిన ఉత్తరాన్ని చేతిలో పట్టుకొని తేజ వెక్కి వెక్కి ఏడుస్తూ.. నేను ఏడిస్తే మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏడుస్తున్న తేజను, యావర్ (Yawar) దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు.
శుభ శ్రీ, గౌతమ్
ఇక శుభ శ్రీ.. నాకు ఈ లెటర్ కావాలంటూ ఏడుస్తుంది. ఇటు గౌతమ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొదటి నుంచి మంచి అనుబంధాన్ని ఏర్పర్చుకున్న వీళ్లిద్దలో లెటర్ ఎవరు త్యాగం చేస్తారో.
ఇక ఈరోజు నైట్ ఎపిసోడ్ అంతా కన్నీటిమయం అయ్యేలా కనిపిస్తుంది. అసలు ఎవరు, ఎవరి కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు పంపిన ఉత్తరాలను త్యాగం చేస్తారు.. అని చాలా ఆసక్తిగా ఉంది.
Also Read: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2.0 గ్రాండ్ లాంచ్.. ఈ ఏడుగురి వైల్డ్ కార్డు ఎంట్రీ..