Ramayanam: రణ్‍బీర్, సాయిపల్లవి ‘రామాయణం’ నుంచి బిగ్ అప్ డేట్! రణ్ బీర్, సాయిపల్లవిల నయా మూవీ ‘రామాయణం’ నుంచి బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటనరానుంది . By srinivas 02 Mar 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ramayana: అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ అప్ కమింగ్ బాలీవుడ్ మూవీ ‘రామాయణం’ నుంచి బిగ్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ లు కనిపించనుండగా స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ మూవీని అధికారికంగా ప్రకటించేందుకు ఓ ప్రత్యేకమైన రోజును మూవీ టీమ్ సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ నమవి స్పెషల్.. ఈ మేరకు రామాయణం సినిమాను శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీన అధికారికంగా ప్రకటించాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. రామాయణం మూవీ నటీనటులు, టెక్నిషియన్లు, రిలీజ్ ప్రణాళిక విషయాలను ప్రకటించేందుకు రామనవమి కంటే అత్యుత్తమమైన రోజు ఉండదని మేకర్స్ వెల్లడించినట్లు మేకర్స్ టీమ్ ఒక ప్రకటనలో తెలిపినట్లు తెలుస్తోంది. అలాగే 2025 దీపావళికి రామాయణం పార్ట్-1ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తునట్లు టాక్ నడుస్తోంది. ఇది కూడా చదవండి :Rishabh Pant: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై వీడనున్న ఉత్కంఠ.. మెగాటోర్నీకి కష్టమేనా? ఆస్కార్ విజేతలతో.. ఇక రామాయణం మూవీ షూటింగ్ మార్చిలోనే మొదలుకానుందని, టెక్నికల్‍గా అత్యంత అడ్వాన్డ్స్ చిత్రంగా తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ తీవారీ భావిస్తున్నారట. ఆస్కార్ అవార్డులను గెలిచిన వీఎఫ్‍ఎక్స్ కంపెనీ డీఎన్‍ఈడీని ఆయన నియమించుకున్నారట. హాలీవుడ్ టెక్నిషియన్లు.. ఈ చిత్రం కోసం ఇండియాకు వచ్చే పని చేయనున్నారని టాక్. నొయిడాలోని ఫిల్మ్ సిటీలో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ నటించడం దాదాపు ఖరారైంది. కైకేయి పాత్రలో లారా దత్త, శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారని టాక్. దశరథుడి పాత్ర కోసం దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్‍తో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. #sai-pallavi #ramayanam #ranbir #april-17 #anouncement మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి