Kalki 2898AD : 'కల్కి' ఓటీటీ రిలీజ్ విషయంలో బిగ్ ట్విస్ట్.. సినిమా చూడాలంటే అన్ని వారాలు ఆగాల్సిందే? 'కల్కి' ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్ రిలీజ్ తర్వాత కాస్త ఆలస్యంగా ఓటీటీలో సినిమాని రిలీజ్ చేయనున్నారట. సినిమా రిజల్ట్ ఏదైనా సరే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్మాతలు ముందే సదరు ఓటీటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. By Anil Kumar 23 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Big Twist In Kalki OTT Release : ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ఈ నెల 27 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచేశారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో ప్రభాస్ ఫస్ట్ టైం చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లను పెంచారు. తెలంగాణా (Telangana) లో టికెట్ రేట్ల గురించి ఇప్పటికే క్లారిటీ రాగా.. ఆంధ్రాలో టికెట్ రేట్స్ పై డిష్కసన్ నడుస్తోంది. ఈ వ్విషయం కాస్త పక్కన పెడితే 'కల్కి' (Kalki 2898AD) ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్ రిలీజ్ తర్వాత కాస్త ఆలస్యంగా ఓటీటీ (OTT) లో సినిమాని రిలీజ్ చేయనున్నారట. ఈ మధ్య థియేటర్లలో రిలీజైన సినిమాలు.. నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలంటే రెండు వారాల్లోనే వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల విషయంలోనూ ఇలానే జరుగుతుంది. Also Read : నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న తారక్ చిన్నప్పటి వీడియో! అన్ని వారాలు ఆగాల్సిందే... దీంతో 'కల్కి' నిర్మాతలు ముందే సదరు ఓటీటీ సంస్థలతో డీల్ మాట్లాడుకున్నారట. సినిమా రిజల్ట్ ఏదైనా సరే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. కాగా 'కల్కి' సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. #telangana #prabhas #kalki-movie #kalki2898ad-ott-release మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి