Minister Roja : మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి.. జడ్పీటీసీ మురళీధర్, మంత్రి రోజా మధ్య ముదిరిన రగడ

మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంత్రి రోజాకు ఆహ్వానం లేకుండా సచివాలయం ప్రారంభించారు జడ్పీటీసీ మురళీధర్. అయితే, జడ్పీటీసీ శిలాఫలకాన్ని తొలగించి అదే సచివాలయాన్ని తిరిగి ప్రారంభించారు మంత్రి రోజా.

New Update
Minister Roja : మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి.. జడ్పీటీసీ మురళీధర్, మంత్రి రోజా మధ్య ముదిరిన రగడ

Also Read: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..

కక్ష సాధింపుతో..

ఇదిలా ఉండగా అటు మంత్రి రోజా ప్రవర్తనపై జడ్పిటిసి మురళీధర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రోజా అన్నల అవినీతి పెరిగిపోతుందంటున్నారు. రోజాని ఓడించడానికి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు జడ్పిటిసి మురళీధర్. మంత్రి రోజాకు వ్యతిరేకంగా పుత్తూరు, వడమాలపేట వైసీపీ నేతలు ప్రెస్‌మీట్(Press Meet) నిర్వహించారు. కక్ష సాధింపుతో అభివృద్ధి పనుల్ని మంత్రి రోజా అడ్డుకుంటున్నారన్నారు. 5 మండలాల్లో రోజా సోదరులు అవినీతికి పాల్పడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ ఇస్తే అంతే..

క్వారీలు, ఇసుక, ప్రభుత్వ భూముల దందా చేస్తూ.. అభివృద్ధి పనుల్లో వాటా అడుగుతూ వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రోజాను గెలిపించినందుకు తమకు మంచి గుణపాఠం నేర్పిందని మండిపడుతున్నారు. రోజాపై 5 మండలాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కామెంట్స్ చేశారు. ఈ సారి రోజాకు టికెట్ ఇస్తే టీడీపీ గెలుస్తుందని.. ఆమెకు టికెట్ ఇస్తే అంతా రాజీనామా చేస్తామని తేల్చిచెబుతున్నారు. నగిరి గురించి సీఎం జగన్ పునరాలోచించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు