/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Arvind-arrest-jpg.webp)
ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తాజాగా చేసిన ప్రకటనతో.. త్వరలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అవుతారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.