MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 26న విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్

MLC Kavitha as Accused in Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్ లో సీబీఐ (CBI) చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు (Notices) పంపిన విషయం తెలిసిందే. 2022లో ఎమ్మెల్సీ కవిత ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టింది. ఇదే కేసులో కవితను ఇప్పటి వరకు మూడు సార్లు ప్రశ్నించింది ఈడీ (ED). ఇటీవల ఈ కేసులో విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు పంపడంతో ఆమె సుప్రీం కోర్టు ఆశ్రయించింది. ఈడీ నోటీసులను కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కవిత వేసిన పిటిషన్ ఈ నెల 28న సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. తాజాగా సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కవిత విచారణకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

జనవరిలో ఈడీ నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కూడా ఇరుక్కోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో ఆమెను ఈడీ అధికారులు కూడా విచారణ చేశారు. దీంతో కవిత అరెస్ట్‌ అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారాలు కూడా జరిగాయి. ఇప్పటివరకు ఈడీ (ED) కవితకు మూడు సార్లు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 15న కవితకు ఈడీ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది.

విచారణకు రాలేను

లిక్కర్‌ స్కామ్ కేసులో జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు పంపింది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. ఈ లిక్కర్ కేసు విచారణకు రాలేనంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. ఇప్పటికీ తన కేసు సుప్రీంకోర్టులో (Supreme Court) పెండింగ్‌లో ఉందని అందుకే రాలేకపోతున్నానంటూ కవిత లేఖలో తెలిపారు.

Also Read: ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు