T20 World Cup 2024: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగటం కష్టమే.. By Durga Rao 07 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ICC T20 World Cup 2024: ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరూ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 1 నుంచి 29 వరకు జరుగనున్న మినీ వరల్డ్ కప్‌కి యునైటెడ్ స్టేట్స్ (US), వెస్టిండీస్ (West Indies) ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టోర్నీలో పాల్గొంటున్న దేశాలు తమ స్క్వాడ్‌లను అనౌన్స్ చేశాయి. ఐసీసీ ఇటీవలే టీ20 ప్రపంచకప్ అధికార గీతాన్ని కూడా విడుదల చేసి మరింత జోష్ తీసుకొచ్చింది. అంతా సవ్యంగా జరుగుతున్న క్రమంలో టీ20 వరల్డ్ కప్‌కి నార్త్ పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనే వార్తలతో ఆందోళన నెలకొంది. 2008 ముంబై ఎటాక్స్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య దైపాక్షిక సీరీస్‌లు రద్దయ్యాయి. పాకిస్థాన్ (Pakistan) జట్టును భారత ప్రభుత్వం అనుమతించడం లేదు. అలానే పలు సందర్భాల్లో ఇతర దేశాల క్రికెట్ ప్లేయర్‌లపై పాక్‌లో దాడులు జరిగాయి. తాజాగా వస్తున్న వార్తలు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహణ, భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. The ICC Men's T20 World Cup Anthem from @duttypaul & @Kestheband is here - and it’s Out Of This World! 🌎 🏏 See if you can spot some of their friends joining the party @usainbolt, @stafanie07, Shivnarine Chanderpaul, @henrygayle 🤩#T20WorldCup | #OutOfThisWorld pic.twitter.com/SUHHaLt6AW — T20 World Cup (@T20WorldCup) May 2, 2024 * పాకిస్థాన్ నుంచి తీవ్రవాద ముప్పు కరేబియన్ మీడియా సంస్థల నుంచి వచ్చిన నివేదికలు టీ20 ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు ఉందని సూచిస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్‌ని హైలైట్ చేశాయి. ఈ నివేదికల ప్రకారం, ‘ప్రో-ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా సోర్సెస్’ క్రీడా కార్యక్రమాలపై హింసను ప్రోత్సహిస్తున్నాయి. అదనంగా, ISIS ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ శాఖ అయిన IS-ఖొరాసన్ (IS-K) విడుదల చేసిన వీడియో మెసేజ్‌ల సర్క్యులేట్ అవుతున్నాయి. దాడులను ప్రోత్సహిస్తున్నాయి, వారి సొంత దేశాల్లో హింసలో పాల్గొనమని అనుచరులకు పిలుపునిస్తున్నాయి. * సేఫ్టీ, సెక్యూరిటీకి CWI ప్రాధాన్యం క్రికెట్ వెస్టిండీస్ (CWI) అభిమానులు, వాటాదారులకు భరోసా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటోంది. క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్స్ ‘క్రిక్‌బజ్’తో మాట్లాడుతూ..‘టీ20 ప్రపంచ కప్‌కి భద్రత కల్పించడం మా మొదటి ప్రాధాన్యత. ఎలాంటి సంభావ్య ప్రమాదాలను అయినా అడ్డుకోవడానికి తగిన ‘కాంప్రహెన్సివ్ అండ్ రోబస్ట్ సెక్యూరిటీ ప్లాన్’ ఉంది.’ అని పేర్కొన్నారు. * ముప్పును ఎదుర్కోవడానికి సహకారం కరేబియన్ కమ్యూనిటీ (CARICOM), రీజినల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి కలిసి పని చేస్తున్నట్లు సమాచారం. ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బడోస్, ఇతర ఆతిథ్య దేశాల్లోని అధికారులు పరిస్థితిని క్షుణ్నంగా పర్యవేక్షిస్తున్నారు. Also Read: ఆ హాస్య నటుడు నాపట్ల చీప్ గా వ్యవహరించాడు.. కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్! * టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నాయి? ప్రపంచ కప్‌లో ఆంటిగ్వా, బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో సహా వివిధ కరేబియన్ దీవుల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అదనంగా యునైటెడ్ స్టేట్స్ ప్రధాన నగరాలు ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. భద్రతా సమస్యలను అంగీకరిస్తూనే, ICC, CWI ఓ ప్రకటన విడుదల చేశాయి. రెండు దేశాలు ఆటగాళ్లు, అభిమానులు, పాల్గొన్న వారందరికీ విజయవంతమైన, సురక్షితమైన ప్రపంచ కప్ అనుభవాన్ని అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నాయి. #t20-world-cup-2024 #cricket #pakistan #icc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి