Khammam Congress: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ పోరు భగ్గుమంది. మహిళా నేతల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావ్‌ చేతిలో మైక్‌ లాక్కుని భట్టికి అనుకూలంగా సౌజన్య నినాదాలు చెప్పట్టారు. వర్గాలుగా విడిపోయి జై పొంగులేటి, జై తుమ్మల, జై భట్టి అంటూ నినాదాలు చేపట్టారు.

New Update
Khammam Congress: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

Khammam Congress: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మంలో ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. తాజాగా ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ పోరు భగ్గుమంది. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావ్‌, జిల్లా అధ్యక్షురాలు సౌజన్య మధ్య గొడవ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోవర్గాలుగా విడిపోయి.. జై పొంగులేటి, జై తుమ్మల, జై భట్టి అంటూ నినాదాలు చేపట్టారు అక్కడి మహిళా నేతలు. సునీతా రావ్‌ చేతిలో మైక్‌ లాక్కుని భట్టికి అనుకూలంగా సౌజన్య నినాదాలు చెప్పట్టారు. దీంతో అక్కడి వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కడ ఏమైతుందో తెలియక తలపట్టుకున్నారు.

ALSO READ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్

ఖమ్మం ఎంపీ టికెట్.. మంత్రుల మధ్య వార్.

లోక్ సభ ఎన్నికల్లో విజయం వైపు అడుగులు వెయ్యాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ తలనొప్పిగా మారింది. ఖమ్మం పార్లమెంట్ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో భట్టి సతీమణి మల్లు నందినితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.

సోషల్ మీడియా వేదికగా..

సోషల్‌ మీడియాలో పోటాపోటీగా తమకే ఎంపీ టికెట్ వస్తుందని ప్రచారాలు చేసుకుంటున్నారు భట్టి భార్య, పొంగులేటి సోదరుడు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడంతో ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం సీటు ఎవరకి ఇస్తుందనే దానిపై ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. సతీమణికి ఎంపీ టికెట్ కోసం భట్టి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు పొంగులేటి లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు