BRS Party: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి 20 మంది!

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు.

BRS Party: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి 20 మంది!
New Update

BRS Councillors Joined in Congress: తెలంగాణ ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయ సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం (Khammam) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమక్షంలో కాంగ్రెస్ లో కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి డిప్యుటీ సీఎం భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఆహ్వానించారు.

కొంతకాలంగా బీఆర్ఎస్ స్థానిక నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నేత కాపు సీతాలక్ష్మిపై (Seetha Lakshmi) గతంలో అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని అసమ్మతి కౌన్సిలర్లు కోరారు. ఈ క్రమంలో ఈనెల 19న కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస పరీక్ష జరగనుంది. అవిశ్వాస పరీక్ష సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ప్రస్తుతం టెన్షన్ లో బీఆర్ఎస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు.. రేపు ప్రకటన?

ఖమ్మం కాంగ్రెస్ దే...

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఖమ్మం కీలకంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటే 9 స్థానాలను కాంగ్రెస్ చేతుల్లో పెట్టారు ఖమ్మం ప్రజలు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే.. ఖమ్మం ప్రజలను ఇచ్చిన తీర్పును అనుకూలంగా ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు నేతలకు  మంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదిలా ఉండగా ఖమ్మంలో ఎలాగైనా గులాబీ జెండా ఎగరవేద్దాం అని అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సారి ఆ జిల్లాలో ఎదురుదెబ్బ తగులు తూనే ఉంది. లోక్ సభ ఎన్నికల ముందు కౌన్సిలర్లు రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయిందనే చెప్పాలి. అయితే.. ఖమ్మం జిల్లాలపై కేసీఆర్ ఆశలు వదులుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖమ్మంలో పట్టు కోల్పోయిన బీఆర్ఎస్.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

DO WATCH:

#congress #brs-party #kottagudem-brs-councillors #brs-leaders-resigned #brs-leaders-joined-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe