BRS: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు సొంత పార్టీ కార్పోరేటర్ల బిగ్ షాక్

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగలబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలకు తెలియకుండా అధికార పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పోరేటర్లు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు వ్యతిరేకగా పోరాటం చేద్దామని తీర్మానించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

BRS: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు సొంత పార్టీ కార్పోరేటర్ల బిగ్ షాక్
New Update

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగలబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలకు తెలియకుండా అధికార పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పోరేటర్లు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు వ్యతిరేకగా పోరాటం చేద్దామని తీర్మానించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం నన్నపునేని నరేందర్‌కు మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని కార్పోరేటర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం తమపై ఒత్తిడి తీసుకువస్తే తాము పార్టీ మారుతామని తేల్చి చెప్పారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులతో పాటు ఎమ్మెల్సీ కవితకు ఫ్యాక్స్‌ ద్వారా తమ నిర్ణయాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే నరేందర్‌ కార్పోరేటర్లను బెదిస్తున్నట్లు, తమపై కేసులు పెడుతానని హెచ్చస్తున్నట్లు కార్పోరేటర్లు పార్టీ అధిష్టానానికి తెలిపినట్లు తెలుస్థోంది. ఎమ్మెల్యే రౌడీ షీటర్‌గా మారాడని, అనుచరులతో తమపై దాడికి ప్రయత్నం చేసినట్లు వారు ఆరోపించారు. మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం లేదని తెలిపారు.

మరోవైపు పార్టీ అధిష్టానం కార్పోరేటర్ల లేఖకు స్పందించినట్లు తెలుస్తోంది. వెంటనే వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలకు తెలియకుండా అధిష్టానం పెద్దలు ఎమ్మెల్యే వవహార శైలిపై ప్రైవేట్ వ్యక్తులతో వివరణ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీంతో పాటు ఎమ్మెల్యేకు కార్పోరేటర్ల మధ్య ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ఎమ్మెల్యే, కార్పోరేటర్ల మధ్య సయోధ్య కుదుర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

#brs #warangal #corporators #big-shack #nanappaneni-narender
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe