BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ కార్పోరేటర్ల బిగ్ షాక్
వరంగల్‌లో బీఆర్ఎస్కు భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలకు తెలియకుండా అధికార పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పోరేటర్లు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు వ్యతిరేకగా పోరాటం చేద్దామని తీర్మానించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.