BRS Party: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. By V.J Reddy 15 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Gudem Mahipal Reddy joined Congress: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (Gudem Mahipal Reddy), జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar) కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు చేరారు. తాజాగా గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. BRS MLA Gudem Mahipal Reddy joined Congress కాంగ్రెస్ లోకి పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ 🔸 కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 🔸హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే… pic.twitter.com/T7jLrz3ItN — Congress for Telangana (@Congress4TS) July 15, 2024 #brs-party #congress #gudem-mahipal-reddy #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి