ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులపై విచారణ మళ్లీ మొదలైంది. జూన్ 21 నుంచి ఏపీలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజున హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ ప్రారంభం కానుంది. గతంలో జగన్ అక్రమాస్తులకు సంబందించి సీబీఐ 11 కేసులు నమోదు చేయగా.. ఈడీ 9 కేసులు నమోదు చేసింది. వీటిలో చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అయితే పదేళ్లనుంచి ఈ కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. శుక్రవారం నుంచి ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది.
Also Read: నెట్ పరీక్ష రద్దు.. కొత్త తేదీపై కేంద్ర విద్యాశాఖ కీలక ప్రకటన
2019లో జగన్ సీఎం అయ్యాక.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఆయన హాజరవుతారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్