అక్టోబర్ 18న పిఎంఎల్‌ఎ కేసులకు సంబంధించి.. ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ (Justice Sanjay Kishan Koul)తెలిపారు. ఆ తరువాతే.. విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు ప్రస్తుతం అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీం కోర్టు తెలిపింది. కాగా కవితను నవంబర్ 20 వరకు విచారణకు పిలవబోమని ఈడీ (ED) తరపు న్యాయవాది ఎఎస్‌జి రాజు సుప్రీం కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి ఈనెల 15న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అవే ఉత్తర్వులు కొనసాగుతాయని తాజాగా ధర్మాసానం పేర్కొంది. ఇక, ఇదే కేసులో వరకు కవితకు సమన్లు జారీ చేయబోమని ఈడీ కోర్టుకు తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గత విచారణలో ఈడీ సమన్లను కూడా కవిత తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదన్నారు. నళిని చిదంబరానికి ఇచ్చినట్టే తనకు కూడా వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
అయితే మహిళను విచారణకే పిలవకూడదంటే ఎలా? అని సుప్రీం ప్రశ్నించింది. మహిళలను విచారణకు పిలవొచ్చు కాకపోతే రక్షణ ఉండాలని తెలిపింది. అన్నిటికీ ఒకే ఆర్డర్‌ను అప్లై చేయలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.10 రోజుల పాటు సమన్లు వాయిదా వేయడానికి ఈడీ అంగీకరించింది. కాగా.. కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది.ఈ నేపథ్యంలోనే నవంబర్ 20 వరకూ ఆమెకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్.. అరెస్ట్ తప్పదా?