Fire Accident: బీహార్‌లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలెండర్ పేలిన కారణంగా భారీగా పేలుడు జరగడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కొంతమందిని ఫైర్ ఫైటర్లు రక్షించారు.
బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈరోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భవనం మొత్తం మంటలు, పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రస్తుతం మంటలు పూర్తా అదుపులోకి వచ్చాయి. హోటల్‌లోని గదుల్లో ఎవరైనా చిక్కుకుపోయారా అని సోదాలు చేస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 25 మందిని రక్షించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత తము సమాచారం అందింది అని చెబుతున్నారు అగ్నిమాపక శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్. కరెక్ట్‌గా అదే సమయానికి ఈదురు గాలులు కూడా వీచడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయని...దీంతో ప్రజలు చాలా భయపడ్డారని చెప్పారు. దీనివలన మంటలను వెంటనే అదుపు చేయడం కూడా కష్టతరంగా మారిందని తెలిపారు. కానీ ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా మంటలను అదుపు చేశారని చెప్పారు.
Also Read:Horlicks: బోర్నవీటా దారిలోనే హార్లిక్స్..ఇకపై హెల్త్ డ్రింక్ కాదు