MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతిపై ఓ సామజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్య, పార్వతితో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. 

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణం సంచలనం రేపుతోంది. అయితే తాజాగా సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతిపై ఓ సామజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్య, పార్వతితో పాటు ఇతర అధికారులకు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లందరు కలిసి అక్రమాలకు పాల్పడ్డట్లు తెలిపారు. అయితే ముడాకి సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మరోసారి కేసు నమోదు చేయలేదు.

Also read: వాళ్లకు రుణమాఫీ బంద్.. రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం !

అయితే ముడా భూకేటయింపుల్లో అవకతవకలు జరిగాయని.. ఇందులో పార్వతి ప్రమేయం ఉందని ఇప్పటికే బీజేపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్లీ ఓ సామాజిక కార్యకర్త కూడా ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం భార్య పార్వతి పేరు మీద పంపిణీ చేసిన ప్రత్యామ్యాయ స్థలాల విలువ అసు భుముల విలువ కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

1998లో పార్వతి సోదరుడు మల్లికార్జున ఆమెకు భూమిని ఇచ్చారని సిద్ధరామయ్య చెబుతున్న మాటలు నిజం కాదని.. ఆ భూమిని ఆమె సోదరుడు 2004లో కొనుగోలు చేసి 2010లో పార్వతికి గిప్ట్‌గా ఇచ్చారని ఆ కార్యకర్త తెలిపారు. దాన్ని వ్యవసాయ భూమిని అని తప్పుడు రికార్డులు సృష్టించారని చెప్పారు. మరోవైపు సీఎం సిద్ధరామయ్య మాత్రమే కాకుండా ముడా పరిధిలో రూ.4 వేల కోట్ల విలువైన అక్రమాలు జరిగినట్లు విపక్ష నేత ఆర్. అశోక్ ఆరోపణలు చేశారు. ఈ అక్రమాలను సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ సిద్ధరామయ్య ఖండిస్తున్నారు.

Also read: ఫేక్‌ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?

Advertisment
తాజా కథనాలు