YS Jagan Petition: ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును (High Court) ఆశ్రయించారు. అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా (Opposition Status) ఇవ్వకపోవడంపై పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం తాను గతంలో స్పీకర్ కు లేఖ రాశానని కోర్టుకు తెలిపారు. అయినా.. తనకు ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. జగన్ తన పిటిషన్లో ప్రతివాదులుగా.. ఏపీ స్పీకర్, కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల మంత్రి చేర్చారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీకి (YCP) కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే ఆ పార్టీకి మొత్తం సీట్లలో పదో వంతు దక్కాలని టీడీపీ చెబుతోంది.
ఇది కూడా చదవండి: Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు!
ఇదే విషయాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Speaker Ayyannapatrudu) స్పష్టం చేశారు. ఈ రూల్ ప్రకారం.. కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీ శాసనసభ పక్ష నేతగా ఉన్న జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. ఇదే నిబంధన ప్రకారం.. గత రెండు సార్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదని గుర్తు చేస్తున్నారు.
కానీ వైసీపీ నేతలు, జగన్ మాత్రం అలాంటి రూల్ లేదంటున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైసీపీ మాత్రమేనని.. ఆ పార్టీ నేత జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు జగన్. దీంతో హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: AP Assembly: ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం