BIG BREAKING : ఇస్రో రికార్డ్.. ఆదిత్య ఎల్-1 సక్సెస్

ఇస్రో చరిత్రలో మరో మైలు రాయిని తాకింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపిన ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం సాధించింది. తుది కక్షలోకి ఆదిత్య ఎల్-1 చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.

New Update
BIG BREAKING : ఇస్రో రికార్డ్.. ఆదిత్య ఎల్-1 సక్సెస్

Aditya L1 : ఇస్రో(ISRO) చరిత్రలో మరో మైలు రాయిని తాకింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1 వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది. ఆదిత్య ఎల్-1(Aditya-L1) సంపూర్ణ విజయం సాధించింది. అంతరిక్షంలో ఆదిత్య ఎల్-1 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. నాలుగు దశలు దాటి తుది కక్షలోకి ఆదిత్య ఎల్-1 చేరింది. ఈ ఉపగ్రహం సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఆదిత్య ఎల్-1 విజయవంతం కావడంతో ప్రధాని మోడీ ఇస్రోకి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోడీ (PM Modi) ఇస్రోపై ప్రశంసలు వర్షం. మోడీ ట్విట్టర్ లో.. "భారతదేశం మరో మైలురాయిని సృష్టించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను గ్రహించడంలో మన శాస్త్రవేత్తల కృషికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ ఫీట్‌ను ప్రశంసించడంలో నేను దేశంతో కలిసిపోతున్నాను. మేము మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ యొక్క కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాము." అంటూ రాసుకొచ్చారు.

ఆదిత్య L-1 ప్రయోగం..

సోలార్ సిస్టమ్ లో అతిపెద్ద ఖగోళ పదార్థమైన సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ చేపట్టిన తొలి మిషన్ ఇది. హిందూ పురాణాల్లో సూర్యుడిని ఆదిత్య అని పిలుస్తారు. ఈ క్రమంలో అదే ఆదిత్య పేరుతోనే భారత్ సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు తన తొలి మిషన్ ను 2023 సెప్టెంబర్ 2న శ్రీహరి కోట నుంచి ప్రయోగించింది. ఎల్1 అంటే లెగ్రాంజ్ పాయింట్ 1. భూమికి, సూర్యుడికి మధ్య మొత్తం ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. తాజాగా భారత్ పంపిన ఆదిత్య L-1 నాలుగు దశలు దాటి తుది కక్షలోకి చేరింది.

Also Read : 300ఏళ్ళు బతికే రోజు దగ్గరల్లోనే ఉంది..ఇస్రో ఛైర్మన్

+

Advertisment
Advertisment
తాజా కథనాలు