BREAKING: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు

బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు షర్మిల.

New Update
BREAKING: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు

Nutan Naidu Joined Congress Party Today : బిగ్ బాస్ (Bigg Boss) ఫేమ్ నూతన్ నాయుడు (Nutan Naidu) ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌ (Congress) లోకి ఆహ్వానించారు షర్మిల. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరున్న బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ లో నూతన్ నాయుడు పాల్గొన్నారు. కాగా సీజన్ 2 లో సామాన్యులను ఆహ్వానించింది బిగ్ బాస్ తెలుగు.

అయితే.. ఈ  కోటాలో నూతన్ నాయుడు, అలాగే రేడియో జాకీ గణేష్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ మందకు మంచి స్నేహితుడిగా నిలిచి.. ప్రజల మనసులో నూతన్ నాయుడు చోటు సంపాదించుకున్నాడు. సీజన్ 2 తరువాత పెద్దగా నూతన్ నాయుడు బయట ఎక్కడ కనిపించలేదు. తాజాగా కాంగ్రెస్ లో చేరి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు నూతన్.

Also Read : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్‌ బృందం

Advertisment
తాజా కథనాలు