Tata Group : లక్షద్వీప్‌ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్‌!

లక్ష్మద్వీప్‌ లోని సుహేలీ, కద్మత్‌ దీవుల్లో అతి త్వరలోనే తాజ్‌ బ్రాండెడ్‌ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ ప్రకటించింది. ఈ ప్రకటనతో లక్షద్వీప్‌ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది.

New Update
Tata Group : లక్షద్వీప్‌ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్‌!

Maldives : భారత్‌ - మాల్దీవుల(Maldives) వివాదం రోజురోజుకి హీటెక్కెతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) కొద్ది రోజుల క్రితం లక్షద్వీప్‌(Lakshadweep) పర్యటన చేసిన నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఆయన పర్యటన గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయులు బాయ్‌కాట్‌ మాల్దీవులు (Boycott Maldives) అనే హ్యాష్‌ ట్యాగ్‌ ని సోషల్‌ మీడియాలో వైరల్ చేశారు.

సెలబ్రిటీలు కూడా...

ఈ క్రమంలోనే బాయ్ కాట్‌ మాల్దీవులకు సెలబ్రిటీలు(Celebrities) కూడా మద్దతు పలికారు. తాజాగా లక్షద్వీప్‌ పర్యాటకానికి ఊతమిస్తూ టాటా గ్రూప్‌(Tata Group) ఓ కీలక ప్రకటన చేసింది. లక్ష్మద్వీప్‌ లోని సుహేలీ, కద్మత్‌ దీవుల్లో అతి త్వరలోనే తాజ్‌ బ్రాండెడ్‌ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ ప్రకటించింది. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్దం చేస్తున్నట్లు టాటా అనుబంధ సంస్ధ ఇండియ్‌ హోటల్స్‌ కంపెనీ ప్రకటించింది.

తాజాగా టాటా గ్రూప్ ప్రకటించిన ఈ ప్రకటనతో లక్షద్వీప్‌ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఐహెచ్‌సీఎల్‌(IHCL) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పునీత్‌ చత్వాల్‌ తన సోషల్‌ మీడియా(Social Media) ఖాతా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్‌ లోని సహజమైన బీచ్‌ లు, పగడపు దిబ్బలు పర్యాటకులను ఆకర్షిస్తాయని ఆయన ట్విటర్‌ వేదికగా అన్నారు.

50 వాటర్‌ విల్లాలు..

సుహేలిలో నిర్మించనున్న తాజ్‌ రిసార్టులో సుమారు 60 బీచ్‌ విల్లాలు, 50 వాటర్‌ విల్లాలుతో పాటు సుమారు 110 గదులు కూడా ఉండనున్నట్లు చత్వాల్‌ తెలిపారు. అలాగే కద్మత్‌ ద్వీపంలో నిర్మించనున్న తాజ్‌ రిసార్టులో కూడా 75 బీచ్‌ ఇల్లాలు, 35 వాటర్‌ విల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

ప్రవేగ్‌ కూడా...

అంతేకాకుండా మరో లగ్జరీ రిసార్ట్‌ సంస్థ అయినటువంటి ప్రవేగ్‌ కూడా లక్షద్వీప్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని లక్షద్వీప్ పర్యటన తరువాత మోడీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ కూడా చేసింది. వారిని మంత్రి వర్గం నుంచి తొలగించినప్పటికీ కూడా మాల్దీవులకు మాత్రం వెళ్లేదే లేదని భారతీయులు తెగేసీ చెబుతున్నారు.

ట్రెండింగ్‌ లోకి..

కొందరు అయితే తమ ట్రిప్‌ లను కూడా క్యాన్సిల్‌ చేసుకున్నారు. దీంతో లక్షద్వీప్‌ ల గురించి తెలుసుకోవడానికి భారతీయులంతా కూడా తెగ సెర్చింగ్‌ చేస్తున్నారు. దీంతో లక్షద్వీప్‌ ఒక్కసారిగా ట్రెండింగ్‌ లోకి వచ్చి చేరింది.

Also read: టీటీడీలో ఆ పోస్టులకు ఖాళీలు..మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు