/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T141024.395-jpg.webp)
Bhumi Pednekar : బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) ‘యానిమల్’(Animal Movie) మూవీ విమర్శలపై తన అభిప్రాయం వెల్లడించింది. ఇందులో మహిళలను కించపరిచారంటూ పెద్ద ఎత్తున్న దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కాగా స్త్రీ గొప్పతనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తాను పురుషాధిక్యతకు సంబంధించిన చర్చలోకి వెళ్లేందుకు అసలే ఆసక్తి చూపించనంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.
Eid Mubarak 🌙
Love, Light & Joy to everyone
Missing familia a lot today :)#EidMubarak2022 pic.twitter.com/mDaldsJrve— bhumi pednekar (@bhumipednekar) May 3, 2022
Also Read : Shake Hand : ఏమండోయ్.. వింటున్నారా? ఒక్క షేక్ హ్యాండ్ మన అనారోగ్యాన్ని చెప్పేస్తుంది!
పురుషాధిక్యత గురించి..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి మాట్లాడుతూ.. ‘పురుషాధిక్యత అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడాలంటే నాకు నచ్చదు. మహిళలను తక్కువ చేసి ఎవరు మాట్లాడినా నేను భరించను. అలాంటివాళ్లను చూస్తే నాకు అసహ్యంగా ఉంటుంది. అయితే కోపం అర్థవంతంగా ఉండాలిని కోరుకుంటా. ప్రతి స్పందనలోనూ నిజాయితీ ఉండాలి. మనకు నచ్చిందే కరెక్ట్ అని వాదించడం కూడా నా దృష్టిలో మూర్ఖత్వమే అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
For #sidkiara ❤️🪬 pic.twitter.com/emomObRDUk
— bhumi pednekar (@bhumipednekar) February 13, 2023
ఇది కూడా చదవండి : Kavya Maran : ఐపీఎల్ బ్యూటీ నవ్వింది.. సోషల్ మీడియా షేక్ అయింది!
కళాత్మకంగానే చూడాలి..
ఇక కళాప్రక్రియలన్నింటినీ కళాత్మకంగానే చూడాలని చెప్పిన నటి.. కళాకారులకు విశాల దృక్పధం అవసరమని కొన్ని చెప్పింది. సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కథను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలని, కథ అంటే వ్యక్తిత్వాల సమాహారమని పేర్కొంది. అవి విభిన్నంగా ఉంటాయి. దాన్ని మనం కళారూపంగా చూడాలి. అదేదో మన సమస్యగా భావించి మాట్లాడకూడదంటూ చురకలంటించింది.
అతను మనసులో అనుకున్న వ్యక్తిత్వాలను తెరపై ఆవిష్కరించాడు. ఇందులో అభినందించాలి. తన నుంచి అన్నీ ఇలాంటివే వస్తాయని అనుకోకూడదు. తను మంచి దర్శకుడు. దీనికి భిన్నమైన సినిమా కూడా అతన్నుంచి ఆశించొచ్చు అని తెలిపంది. ఇందులో నటించిన నటీనటులందరూ అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపించింది.