Bhole Baba : హత్రాస్‌లో తొక్కిసలాట వారివల్లే జరిగింది.. భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు

హత్రాస్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలేబాబా తరఫు న్యాయవాది సింగ్‌ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులైన 2న జరిగిన సత్సంగ్‌ కార్యక్రమంలో 10 నుంచి 12 మంది దుండగులు విషపూరిత డబ్బాలు తెరిచారని.. దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు.

New Update
Bhole Baba : హత్రాస్‌లో తొక్కిసలాట వారివల్లే జరిగింది.. భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు

Hathras : హత్రాస్‌ తొక్కిసలాట ఘటనలో 121 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి భోలేబాబా తరఫు న్యాయవాది సింగ్‌ తాజాగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. ' జులైన 2న హత్సాస్‌ సత్సంగ్‌ (Hathras Satsang) కొంతమంది వ్యక్తులు విషపూరిత డబ్బాలు తెరిచారు. దీనివల్లే తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు నాతో చెప్పారు. భోలేబాబా (Bhole Baba) కు పాపులారిటీ పెరుగుతుందని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారు. తొక్కిసలాట ఘటన జరగకముందు దాదాపు 10 నుంచి 12 మంది దుండగులు అక్కడున్న విషపూరిత డబ్బాలను తెరిచారు.

Also Read: తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్?

తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి పోస్టుమార్టం రిపోర్టులు పరిశీలిస్తే.. వాళ్లు ఊపిరాడకపోవడం వల్లే మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాదు సత్సంగ్ సమీపంలో ఆ దుండగులు పారిపోయేందుకు కూడా వాహనాలు సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి మావద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. సాక్షులకు భద్రత ఇవ్వాలని' భోలేబాబా అన్నారు. ఇదిలాఉండగా.. తొక్కిసలాట ఘటన జరిగిన అనంతరం.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Also Read: దారుణం.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్..

Advertisment
తాజా కథనాలు