వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూజ చేసిన భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం తన నివాసంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూజ చేశారు. By Manogna alamuru 07 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణకు కాబోయే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తనకున్న అభిమానాన్ని మరోసారి చూపించుకున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన తన ఇంట్లో ఉన్న పెద్ద వైఎస్ ఫోటోకి పూజ చేశారు. ఆయన చిత్రపటానికి పూలు వేసి తన కృతజ్ఞతను చూపించారు. భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు #BhattiVikramarkaMallu#YSRLivesOn pic.twitter.com/8O9oo7iSsh — Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 7, 2023 మల్లు భట్టి విక్రమార్క.. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నాలుగవసారి బంపర్ మెజార్టీతో మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని బట్టి చాలా అభిమానిస్తారు. దేవుడి కింద ఆరాధిస్తారు. తాను రాజకీయంగా ఎదిగేందుకు వైఎస్సార్ ఎంతగానో కృషి చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిన భట్టికి 2009లో మొదటిసారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు వైఎస్సార్. అప్పటివరకు సీపీఐ(ఎం) కంచుకోటగా ఉన్న మధిరలో ఆయన గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టగా.. 2023లోనూ విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్‌గా మల్లు భట్టి విక్రమార్క పని చేశారు. 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2018లో తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా భట్టి ఎన్నికయ్యారు. వీటన్నికీ కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డే అని భట్టి బలంగా నమ్ముతారు. మొదటిసారి తన మీద నమ్మకముంచి ఎమ్మెల్యేగా నిలబెట్టిన వైఎస్ గురించి ఎప్పుడూ గొప్పగా చెబుతూ..ఎమోషనల్ అవుతుంటారు బట్టి. తెలంగాణలో చావు బతుకుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మంచి చేయూతనిచ్చారు మల్లు భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మధిర వరకు 1360 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ యాత్ర 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. #bhatti-vikramarka #telangana #ys-rajasekhar-reddy #deputi-cm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి