Mallu Nandini: ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మల్లు నందిని!

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం 11 మంది ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే వారిలో నందినికే టికెట్ రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

New Update
Mallu Nandini: ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మల్లు నందిని!

Khammam MP Ticket to Mallu Nandini: ఖమ్మం ఎంపీ టికెట్ విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ (Congress) అధిష్టానం ఇక్కడి టికెట్ ఎవరికి ఇవ్వనుంది అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. అయితే మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భార్య నందిని మాత్రం టికెట్ తనకే వస్తుందని తెగ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకే ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమైపోతున్నారు. మరోవైపు ఈ సీటును తన భార్యకే ఇప్పించాలని డిప్యుటీ సీఎం భట్టి కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయన భార్య నందిని ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read: Delhi - 2వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత..సూత్రధారి సినీ నిర్మాత
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతుండడంతో తనకే టికెట్ వస్తుందనే భావనతో మల్లు నందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల భారీ ర్యాలీతో గాంధీభవన్‌లో నందిని (Mallu Nandini) అప్లికేషన్‌ సమర్పించారు. దాదాపు 200 కార్లతో ర్యాలీగా వెళ్ళి మరీ అప్లికేషన్‌ను ఇచ్చారు. ఇప్పుడు ఖమ్మంలో తన పర్యటనలకు కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఖమ్మంలో మల్లు నందిని పర్యటించనున్నారు. ఇప్పటికే అక్కడి నియోజకవర్గ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. రేవంత్‌ (CM Revanth Reddy), భట్టి ఢిల్లీ టూర్‌ తర్వాత ప్రజల్లోకి పూర్తిస్థాయిలోకి వెళ్లాలని నందిని నిర్ణయించారు.

మరోవైపు మల్లు నందిని యాక్టివ్‌ కావడంతో..ఎంపీ టికెట్‌ ఆమెకే ఓకే అయిందంటున్నారు భట్టి అనుచరులు. దీంతో నందిని అభ్యర్థిత్వానికి అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఖమ్మం ఎంపీ టికెట్‌ కోసం మొత్తం 11 దరఖాస్తులు పెట్టుకున్నారు. అప్లై చేసినవారిలో మంత్రుల కుటుంబ సభ్యులు సహా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం ఇంకా ఎవరి పేరునూ ప్రకటించలేదు.

Also Read: డ్రైవర్ లేకుండా 80 కి.మీ దూసుకెళ్లిన ట్రైన్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు