BJP: ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ

తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో ఎన్నికల (Elections) వేడి మొదలయ్యింది. ఇప్పటికే బీఆర్‌ఎస్(BRS) రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టింది. కమిటీ మెంబర్లను నియమించింది. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఓ అడుగు ముందుకు వేసింది.

New Update
Big Breaking: మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..

తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో ఎన్నికల (Elections) వేడి మొదలయ్యింది. ఇప్పటికే బీఆర్‌ఎస్(BRS) రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టింది. కమిటీ మెంబర్లను నియమించింది. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఓ అడుగు ముందుకు వేసింది. రాబోయే ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా తెలంగాణను కైవసం చేసుకోవాలని చూస్తుంది.

ఇప్పటికే ఢిల్లీ పెద్దలు చాలా మంది తెలంగాణలో సమావేశాలు కూడా నిర్వహించారు..నిర్వహిస్తున్నారు కూడా. ఇప్పటికే మోడీ, అమిత్‌ షా తెలంగాణలో అడపాదడపా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తాజాగా ఎన్నికల కమిటీలను నియమించింది. బీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Also read: పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..ఎగిరిపడ్డ మృతదేహాలు!

వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు పన్నాలి, మేనిఫెస్టో రూపకల్పన, బహిరంగ సభల నిర్వహణ, పబ్లిసిటీ, నిరసనల వంటి కార్యక్రమాలను కూడా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టాలని అగ్ర నాయకత్వం నిర్ణయించింది. మొత్తం పద్నాలుగు కమిటీలను బీజేపీ నియమించింది.

తెలంగాణను మొత్తం ఆరు జోన్లుగా విభజించుకున్నారు. ఒక్కో జోన్ కు ఒక్కో నేతను నియమించి పార్లమెంట్, శాసన సభ నియోజక వర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలను అప్పగించారు. మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా వివేక్‌ వెంకట స్వామి, కన్వీనర్ గా మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కన్వీనర్‌ గా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని కమిటీ నియమించింది.

స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ ఛైర్మన్ గా బండి సంజయ్, నిరసనల కమిటీ ఛైర్మన్ గా విజయశాంతి, ఛార్జ్‌షీట్ కమిటీ ఛైర్మన్ గా మురళీధరరావుని నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు