Bharateeydu 2 : ఆడియన్స్ దెబ్బకు రన్ టైం తగ్గించిన మేకర్స్.. ఏకంగా అన్ని నిమిషాలా? 'భారతీయుడు 2' ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రన్ టైమ్ పై ఎక్కువగా కంప్లైంట్ వచ్చింది. ఇది గమనించిన మూవీ టీమ్ తాజాగా సినిమాలో 20 నిమిషాల సన్నివేశాల్ని కట్ చేశారు. దీంతో 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వెర్షన్‌ని ఆదివారం నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. By Anil Kumar 14 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bharateeyudu 2 Run Time Trimmed To 20 Minutes : ఈ మధ్య సౌత్ లో తెరకెక్కిన బడా సినిమాలన్నీ భారీ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ వస్తుంది. సుమారు మూడు గంటలకు పైనే ఈ రన్ టైం ఉంటుంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఆడియన్స్ నిడివిని పెద్దగా పట్టించుకోరు. కానీ కంటెంట్ లేకుంటే బాగా ల్యాగ్ అయిందని, అనవసరంగా రన్ టైం పెంచారని రిలీజ్ తర్వాత మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా 'భారతీయుడు 2' విషయంలోనూ ఇదే జరిగింది. సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు. జులై 12 న రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమా చూసిన చాలా మంది బాగా ల్యాగ్ అయిపోయిందని, మేలో డ్రామా వర్కౌట్ కాకపోవడంతో బోర్ కొట్టించిందని అన్నారు. మాములుగా శంకర్ సినిమాలంటే దాదాపు 3 గంటలకు పైన రన్ టైం తో ఉంటాయి. Also Read : అంబానీ పెళ్లి.. ఆ స్టార్ హీరోలకు గిఫ్ట్ గా కాస్ట్లీ వాచ్ లు, వాటి ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 20 నిమిషాలు కట్... ఆయన చాలా సినిమాలకు ఇది వర్కౌట్ అయింది. కానీ 'భారతీయుడు 2' కు వచ్చేసరికి బెడిసి కొట్టింది. దీంతో తాజాగా మేకర్స్ తమ తప్పును సరిదిద్దుకున్నారు. సుమారు 3 గంటల నిడివితో రిలీజైన 'భారతీయుడు 2' సినిమాలో అనవసరంగా అనిపించిన 20 నిమిషాల సన్నివేశాల్ని ఇప్పుడు తీసేశారట. దీంతో 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వెర్షన్‌ని ఆదివారం నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇక ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్స్ ఈ పనేదో ముందే చేసుంటే బాగుండేది కదా, ఇప్పుడు తగ్గించి ఏం లాభం అని మేకర్స్ పై సెటైర్లు వేస్తున్నారు. #kamal-haasan #bharateeyudu-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి