Bharat rice:మార్కెట్లోకి త్వరలోనే భారత్ రైస్

దేశ వ్యాప్తంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే త్వరలోనే మార్కెట్లోకి భారత్ రైస్ ను తీసుకొస్తామని చెబుతోంది.

New Update
Bharat rice:మార్కెట్లోకి త్వరలోనే భారత్ రైస్

భారతదేశంలో ఎక్కువ మంది తినేది అన్నం. ఇప్పుడు అదే ప్రియమై కూర్చుంది. అనూహ్యంగా బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. దీన్ని ప్రిస్టీజ్ ఇష్యూగా తీసుకుంది కేంద్రం. ఈ ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్‌లోకి Bharat rice ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది. కిలో రూ.25 చొప్పున వీటిని విక్రయించనుంది. అందులోనూ మరో నాలుగునెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బియ్యం ధరల ప్రభావం ఎన్నికల మీద పడకూడదని అనుకుంటోంది. అందుకే ఎన్నికలలోపునే భారత్ రౌస్ ను మార్కెట్లోకి తేవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Also Read:ఢిల్లీ ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర భారీ పేలుడు..అప్రమత్తంగా ఉండాలంటోన్న అడ్వైజరీ

భారత్ పిండి, పప్పు పేరుతో ఇప్పటికే గోధుమ పిండి, కందిపప్పు లను తక్కువ ధరలకే అమ్ముతోంది. ఇది బాగానే సక్సెస్ అయింది. అందుకే రైస్ విషయంలోనూ ఇదే విధంగా స్కీమ్ తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం. National Agricultural Cooperative Marketing Federation of Indiaతో పాటు National Cooperative Consumers’ Federation of India Ltd, కేంద్రీయ భండార్ ఔట్‌లెట్స్, మొబైల్ వ్యాన్స్ ద్వారా ఈ రాయితీని అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ రైస్‌ ధర కిలోకి రూ.43 దాటింది. గతేడాదితో పోల్చి చూస్తే..ఇది 14.1% ఎక్కువగా ఉంది. దీనివలన ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వెంటనే తగ్గించాలని చూస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి రాయితీ కింద కిలో గోధుమలను రూ.27.50కి, పప్పులను రూ.60 చొప్పున విక్రయిస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల రిటైల్ పాయింట్స్ వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఒక్క నవంబర్‌లోనే బియ్యం ధర 10.3% మేర పెరిగింది. ఫలితంగా...Food Inflation ఒక్కసారిగా 8.7% పెరిగింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు బియ్యం అందుబాటు ధరలో ఉండేలా చూడనుంది ప్రభుత్వం.

రైస్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. ఆ స్థాయిలో సరఫరా లేకుండా పోయింది.కన్జూమర్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ప్రైస్ మోనిటిరింగ్ డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం చూస్తే...ఏడాది కాలంలోనే బియ్యం ధరలు 15% మేర పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకి రూ.37.99గా ఉంది. ఇదే ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి ఇది రూ.43.51 కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ ఉంది. ఈ పెరుగుదల ఎక్కడి వరకూ వెళ్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి.

Advertisment
Advertisment
తాజా కథనాలు